Uttarkashi Cloudburst” ఊరును ముంచేసిన వ‌ర‌ద‌.. భ‌యాక‌న వీడియో..

Uttarkashi Cloudburst”  ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర్‌కాశి జిల్లాలోని హై ఆల్టిట్యూడ్ గ్రామమైన ధరాలి వద్ద మంగళవారం ఉదయం మేఘవిస్ఫోటం (Cloudburst) సంభవించింది. దీంతో భారీ వరదలు (Flash Floods) వ‌చ్చాయి.. వరద ముప్పుతో అనేక గ్రామాలు మునిగిపోయాయి..  50 మంది వ‌ర‌కు  వ్యక్తులు గల్లంతైనట్టు సమాచారం. గ్రామస్థుల ప్రకారం, చాలా ఇల్లు వరద నీటిలో కొట్టుకు పోయాయి.

దృశ్యాలు భయానకంగా మారాయి
పర్వతాల నుంచి ప్రవహించిన భారీ వ‌ర‌ద ధరాలి అనే గ్రామాన్ని చుట్టుముట్టింది. ఇండ్ల ముంచెత్తుకుంటూ వ‌ర‌ద నీరు వెళ్ల‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు. నీటి ప్రవాహాన్ని ప‌క్కన నిలబడి వీడియో తీస్తున్న వారు ప‌రుగెత్తండి ప‌రుగెత్తండి అంటూ గ్రామస్తులను హెచ్చరిస్తున్న శబ్దాలు వీడియోల్లో వినిపిస్తున్నాయి.

రక్షణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ, “రక్షణ బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి,” అని చెప్పారు. గల్లంతైనవారిని గుర్తించి రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించిందని తెలిపారు.

అమిత్ షా స్పందన – ITBP, NDRF బృందాలు రంగంలోకి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి ధరాలి ప్రాంతంలో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్ ఘటనపై సమాచారం పొందాను. సమీపంలోని మూడు ITBP బృందాలు, నాలుగు NDRF బృందాలు అక్కడకు తరలించబడ్డాయి. ఇవి త్వరలో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడతాయి,” అని అమిత్ షా తన X (ట్విట్టర్) ఖాతాలో తెలిపారు.

ఆర్మీ కూడా రంగంలోకి – భారీ కొండచరియల
భారీ వర్షాల కారణంగా ఖీర్ గాఢ్ ప్రాంతంలోని ధరాలి గ్రామం వద్ద మట్టికొండలు (mudslide) విరిగిపడి నీటితో కలిసి గ్రామాన్ని ముంచెశాయి. హర్షిల్ సమీపంలోని ప్రాంతంలో ఆర్మీ బలగాలు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాయి.

 

 

 

Satrani Women's Shimmer Net Embroidery And Scalloped Border Saree with Unstitched Blouse Piece

నెట్ సారీస్ మెగా ఆఫ‌ర్ !
⚡ కనీసం 60% డిస్కౌంట్
✨ Womanista, Siril & ఇంకా చాలా బ్రాండ్స్ పై!

స్టైల్ & ఎలిగెన్స్ కలిపిన లుక్…
ఇప్పుడే బుక్ చేయండి
ట్రెండింగ్ నెట్ చీరలు తక్కువ ధరకే!

️ డీల్స్ ఈరోజే… లేటవ్వకండి!

అమెజాన్‌లో కొనేందుకు  https://amzn.to/4mw2q7i లింక్‌పై క్లిక్ చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *