ప్రముఖ మేసేజ్ యాప్ అయినటువంటి వాట్సప కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వీడియో కాల్‌లో స్క్రీన్ షేర్, ల్యాండ్‌స్కేప్ మోడ్ అనే రెండు కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇవి ఐ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, విండోస్లలో మాత్రమే ఉంటుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్లు వాట్సప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని వాట్సప్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. కొత్త స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌తో యూజర్లు కాల్ సమయంలో వారి లైవ్ స్క్రీన్‌ను కాల్‌లో జాయిన్ అయిన అవతలి వ్యక్తికి చూపెట్టవచ్చు. ‘షేర్’ ఐకాన్ను క్లిక్ చేసి యాప్‌ను లేదా మొత్తం స్క్రీన్‌ను షేర్ చేయొచ్చు. వినియోగదారులు వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్న వ్యక్తులతో డాక్యుమెంట్స్, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడానికి వీలు ఉంటుంది. వివిధ పనుల డాక్యుమెంట్స్ షేర్ చేయడానికి, కుటుంబంతో కలిసి ఫొటోలు చూడటానికి, హాలిడే ప్లాన్‌లు చేయడానికి, కలిసి షాపింగ్‌లు చేయడానికి, లైవ్‌లో టెక్నికల్ సపోర్ట్ అందించేందుకు ఆప్షన్లను వినియోగించవచ్చు.
వాట్సప్లో స్క్రీన్‌ని షేర్ చేయాలనుకుంటున్న వ్యక్తితో ముందు వీడియో కాల్ స్టార్ట్ చేయాలి. స్క్రీన్ కింద, స్క్రీన్ షేరింగ్ అనే బటన్ పై నొక్కాలి. ఈ బటన్ దానిలో కర్వ్‌డ్ షేప్ యారోతో కనిపిస్తుంది. క్లిక్ చేశాక పాప్-అప్ మెసేజ్ వస్తుంది. స్క్రీన్‌పై ఉన్న మొత్తం సమాచారానికి వాట్సప్ యాక్సెస్ అవుతుందని ఆ మెసేజ్ అలర్ట్ చేస్తుంది. స్టార్ట్ నౌ పై క్లిక్ చేస్తే స్క్రీన్ అవతలి వ్యక్తితో షేర్ అవుతుంది. అప్పుడు ఎప్పటిలాగే మన ఫోన్ లో ఉన్న యాప్స్, ఫొటోలు ఓపెన్ చేయొచ్చు. దీంతో అవలి వ్యక్తితో వాటిని పంచుకోవచ్చు. ఇవే కాకుండా స్క్రీన్ షేర్ స్టార్ట్ అయిన తర్వాత అవతలి ఏదైనా యాప్ ను ఎలా వాడాలి, అందులో ఏంఏం ఫీచర్లు ఉన్నాయని లైవ్ స్క్రీన్ లో చూపించవచ్చు. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో వీడియో కాల్ చేసేందుకు స్క్రీన్ తిప్పాలి.
స్క్రీన్ షేరింగ్ చేసేటప్పుడు వీడియో కాల్ సమయంలో మాత్రమే స్క్రీన్‌ని షేర్ చేయొచ్చు. మొత్తం స్క్రీన్‌ను కానీ ఓన్లీ వన్ యాప్‌ను షేర్ చేయడం కూడా వీలవుతుంది. యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లు స్క్రీన్‌పై ఉన్న ప్రతిదాన్ని వీడియోకాల్ ఉన్న వ్యక్తి చూపెట్టవచ్చు. ఇదే సమయంలో వ్యక్తిగత సమాచారం కూడా గోప్యంగా ఉంచుకోవాలి. దాంతో పాటు డేటా కూడా సరిపోయేంత ఉంచుకోవాలి