Student Visa”అమెరికాలో చదువులపై ఆసక్తి ఉన్న విదేశీ విద్యార్థులకు మరో షాక్
వాషింగ్టన్, జూలై 2:
అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు సంబంధించి వీసాల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తాజా ప్రతిపాదనల ప్రకారం, స్టూడెంట్ వీసాలకు ఒక నిర్దిష్ట గడువును నిర్దేశించనున్నారు. ఇప్పటివరకు ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (D/S) అనే సౌకర్యం ద్వారా విద్యార్థులు తమ కోర్సు లేదా ఇంటర్న్షిప్ పూర్తయ్యేంతవరకు ఉండే అవకాశం ఉండేది.
కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం, వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని చూస్తున్నారు. అంటే, ఇకపై విద్యార్థి వీసాలకు కాల పరిమితి విధించనుండగా, వీసా గడువు ముగిసిన తర్వాత, విద్యార్థులు తమ వీసా పొడిగింపుకు తిరిగి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఈ మార్పులపై న్యాయవాదులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఈ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముంది. ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఎఫ్-1 లేదా జే-1 వీసాలపై ఉన్నారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై అధికారికంగా పబ్లిక్ అభిప్రాయాలను తీసుకునే ప్రక్రియలో ఉన్నాయి. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన అనంతరం, 30 నుండి 60 రోజులు ప్రజల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. కొన్ని సందర్భాల్లో, తక్షణమే అమలు చేసే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
T20 Rules” టీ20 ఫార్మాట్లో బౌలర్లకు ఊరట: జూలై నుంచి కొత్త నిబంధనలు
Bhopal” 2025పార్టనర్ ను చంపి.. రెండు రోజులు పక్కనే .. ఛీ..ఛీ
Tv Deals” టీవీలపై భారీ ఆఫర్లు – ఇప్పుడు టీవీ కొనడానికే సరైన సమయం!
