ప్రకాశం జిల్లాలో ఘటన
లారీ ఢికొని ముగ్గురి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు శుక్రవారం అర్దరాత్రి చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకుల ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన యువకుల్లో అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్ర ఉన్నారు. సమాచారం తెలుసుకున్నా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురికి తరలించారు.
