చెరువులో ప‌డి న‌లుగురు మృతి

బ‌ట్ట‌లు ఉతికేందుకు వెళ్లిన న‌లుగురు ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డిమృతి చెందిన ఘ‌ట‌న మెద‌క్ జిల్లా మ‌నోహ‌రాబాద్ మండలంలోని రంగాసాయిప‌ల్లిలో సోమ‌వారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..   అంబ‌ర్‌పేట గ్రామానికి చెందిన ల‌క్ష్మీ (30), బాల‌మ‌ణి (30), బాల‌మ‌ణి కుమారుడు చ‌ర‌ణ్ (6)లు రంగ‌సాయి ప‌ల్లి గ్రామానికి చెందిన చంద్ర‌య్య ఇంటికి బోనాలు పండుగ ఉండ‌డంతో వ‌చ్చారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఉద‌యం చంద్ర‌య్య కూతురు లావ‌ణ్య (19)తో క‌లిసి బ‌ట్ట‌లు ఉతక‌డం కోసం గ్రామంలోని చెరువుకు వెళ్లారు. బ‌ట్ట‌లు ఉతుకుతున్న క్ర‌మంలో చ‌ర‌ణ్ కాలు జారి చెరువులో ప‌డిపోయాడు. బాలుడిని ర‌క్షించే క్ర‌మంలో మిగితా ముగ్గురు చెరువులో ప‌డి చ‌నిపోయారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

పెండ్లికి ఒప్పుకోలేద‌ని యువ‌తి పై కాల్పులు

వినాయ‌క మండ‌పం వ‌ద్ద విషాదం ఆరేళ్ల బాలుడు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *