మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. పైసలు, ఆస్తి విషయంలో రోజుకో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బు, ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులు, అక్కాచెళ్లెల్లు , అన్న దమ్ములు అని తేడా లేకుండా హత్యలు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘటనే ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికల కథనం ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కనికరపు దేవయ్య (69), లక్ష్మీనర్సమ్మలకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి వెనుకాలే పెద్ద కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఈ క్రమంలో వెనకాల ఉన్న ఫీటున్నర జాగ కోసం గొడవలు జరుగుతున్నాయి.. శనివారం రోజు కూడా విషయమై గొడవజరిగింది. దీంతో మనస్థాపానికి గురైన దేవయ్య, లక్ష్మీ నర్సమ్మలు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా చనిపోయి ఉన్నారు. చిన్న కొడుకు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.