లోయలో పడ్డ బస్సు

భారత్ పర్యాటకులు ఆరుగురు మృతి
బ‌స్సు లోయ‌లోప‌డి 7 గురు మృతి చెందిన ఘ‌ట‌న నేపాల్ దేశంలో గురువారం చోటు చేసుకుంది. అందులో ఆరుగురు భారత్ నుంచి వెళ్లిన ప‌ర్యాట‌కులు ఉన్నారు. భక్తులతో రాజస్థాన్‌ నుంచి వెళ్తున్న బస్సు భార‌త్ స‌రిహ‌ద్దు దాటి నేపాల్‌లోని మాధేవ్‌ ప్రావిన్స్‌లోని బారా జిల్లాలో సిమారా సబ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ వద్ద చురియమై ఆలయానికి స‌మీపంలోని నదీతీరం వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు భారతీయ ప‌ర్యాట‌కులు, ఓ నేపాల్‌ పౌరుడు మృతి చెందాడు. అందులో ఉన్న మరో 19 మంది గాయపడ్డ‌ట్టు నేపాల్‌ అధికారులు చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్ కు చెందిన ఓ వ్య‌క్తి ఉన్నారు. మృతి చెందిన వారి స‌మాచారం వారి బంధువుల‌కు అందించామ‌ని పోలీస్‌ అధికారి ప్రదీప్‌ బహదూర్‌ ఛెత్రి తెలిపారు. బస్సు డ్రైవర్‌ జిలావిూ ఖాన్‌తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు బారా జిల్లా పోలీస్‌ కార్యాలయ చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ హోబీంద్ర బోగటి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *