చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం పంపిన లునా – 25తో సంబంధాలు తెగిపోయినట్టు రష్యా అంతరిక్ష సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ మానవ రహిత నౌక జాబిల్లి దక్షిణ ధ్రువం మీద సోమవారం క్షేమంగా దిగాల్సి ఉండగా అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. స్పేస్ కూలిపోవడానికి ముందు స్పేస్ క్రాఫ్ట్ గతి తప్పిన కక్ష్యలో పరిభ్రమించిందని తెలిపారు. ఈక్రమంలో
శనివారం నాడు పగటిపూట 2:57 గంటల లూనా-25తో సంబంధాలు తెగిపోయినట్టు వివరించారు. ఈ విషయాన్ని రాస్‌కాస్మోస్ ఆదివారం తెలిపింది. రష్యా స్పేస్ ఏజెన్సీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించారు. టెక్నికల్ ఫెల్యూర్ వల్ల లూనా-25 కారణంగా నిర్దేశించిన ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి వెళ్ళలేకపోయినట్టు చెప్పుకొచ్చారు.
ఇండియా కూడా చంద్రయాన్ -3 ని చంద్రుని దక్షిణ దృవంపై పరిశోధనల కోసం పంపారు. అయితే ఈ నెల 23 న చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగనుంది. ఇండియా కంటే వెనక పంపిన రష్యా స్పేస్ క్రాఫ్ట్ లునా 25 ఈ నెల 21 సోమవారం క్షేమంగా ల్యాండ్ కావ్సాల్సింది. కాని అనుకోకుండా అది కూలిపోయింది. ఇప్పటి వరకు దక్షిణ ధృవంపైకి ఏదేశం స్పేస్ క్రాప్ట్‌లను పంపలేకపోయింది.