కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిన పర్యటన
కర్నాకట విజయంతో కొత్త ఆశలు
కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఏడాది పూర్తి చేసుకుంది. పార్టీని మళ్లీ పట్టాలకెక్కించే యాత్రకు శ్రీకారం చుట్టాక మంచి స్పందనే వచ్చింది. ఈ యాత్రపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఒక్కో రాష్టాన్న్రి కోల్పోతున్న వేళ 3,500 కిలోవిూటర్ల పై చిలుకు యాత్ర పార్టీకి పునరుత్తేజం తెచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడిపోతున్నారు. మోడీ వ్యూహాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కాంగ్రెస్‌కు యువరక్తం ఎక్కించాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడు రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. రాహుల్ యాత్రతో పార్టీకి ఏమేర ప్రయోజనం చేకూరుతుందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్న వేళ కర్నాకటలో మంచి ఫలితాలు వచ్చాయి. అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదంతా పాదయాత్ర వల్ల్నే సాధ్యం అయ్యిందనే వారు ఎక్కువగానే ఉన్నారు. ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్కమ్రణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జోడోయాత్ర ఆక్సిజన్ నింపిందన్న విశ్వాసంతో ఉన్నారు. ఎనభై ఏళ్ల క్రితం గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. 117 మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేసారు. 12 రాష్టాల్రు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించి ముందుకు సాగారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం,అసహన రాజకీయాలను ప్రస్తావించడం తోపాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయం ఏంటన్నది తనయాత్ర ద్వారా తెలుసుకున్నానని రాహుల్ అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ వంటి అంశాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రాహుల్ కొంత పరిణతి సాధించారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడంతో పాటు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం, రాష్టాల్లో పాగా వేయాలన్న బలమైన రాజకీయ ఆకాంక్షతో కాంగ్రెస్ ఈ యాత్ర చేపపట్టి విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడాది గడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి పరీక్షగా నిలవనున్నాయి. అయితే జమిలి ఎన్నికలు వస్తే ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వీటిలో తెలంగాణ మినహా మిగతా రాష్టాల్ల్రో బీజేపీతోనే ముఖాముఖి పోరాడాల్సి ఉంది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ మళ్లీ గద్దెనెక్కడం అంత సులభం కాదు. అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. భారత్ జోడో యాత్ర ఆయనకు బాగా కలసి వచ్చిందని చెప్పక తప్పదు. ఆయన పరిణత రాజకీయనేతగా ఎదగడానికి కొంత దోహదపడింది.
Check Also
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
Viral Video” ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు రాకముందు మనుషులు రవాణా కోసం గుర్రపు బండ్లను ఉపయోగించారు. సాంకేతికత పెరిగినంకా గుర్రపు …
Xiaomi Power Bank” మీరు మంచి పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం తగ్గింపుతో.. జియోమీ పవర్ బ్యాంక్
Xiaomi Power Bank” ఫోన్ అవసరాలు ఎక్కువగా ఉన్నవారు మంచి పవర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …
Xiaomi Tv” 42999 రూపాయల విలగల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివరి రోజు
Xiaomi Tv” ప్రస్తుతం అమెజాన్‌లో ఎలక్ట్రానిక్ ఫెస్టివ్ సేల్ నడుస్తోంది. ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ప్రకటించింది. మీరు …