ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ ఆ లారీని ఢీకొన్న‌ కారు, బైక్

ఐదుగురు దుర్మరణం
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం నగరి మండలం ధర్మాపురం వద్ద ఓ లారీ బీభత్సంతో ఐదుగురి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి వ్యాను, కారు, బైకుతో పాటు జాతీయ రహదారిపై మార్కింగ్‌ వేస్తున్న నలుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికిక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో నలుగురికి తీవ్రంగా గాయపడగా.. నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడింది. అదే మార్గంలో వస్తున్న కారు.. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరు మృతి చెందారు. ఇదే మార్గంలో వస్తున్న బైక్ కూడా కారును ఢీకొట్టింది. దీంతో బైక్‌ పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ, కారు, బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

 

మెట్ల మార్గంలో బోనులో చిక్కిన మరో చిరుత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *