కొబ్బరికాయ లేనిదే ఏ శుభకార్యం జరగదు. కొబ్బరికాయ కొట్టడమంటే..ముహూర్తం కుదరిందని అర్థం. మన పూజా విధానాంలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది.ప్రతి ఏడాది సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. కొబ్బరికాయ లేని దైవకార్యం, శుభకార్యం ఉండదు అంటే అతిశయేక్తి కాదేమో. దేవుడికి కొబ్బరిని నైవేద్యంగా పెట్టి అందరికి ప్రసాదంగా పంచుతాం. కొబ్బరి బోండం లోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కొబ్బరి నీళ్ళు అన్నీ కాలాల్లో దాహాన్నితీర్చడమే కాకుండా శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని కలిగాస్తాయి. వీటిలో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చెక్కెర, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి, క్రొవ్వులు అస్సలుండవు. శరీరంలో డీహైడ్రేషన్ కలగకుండా చూస్తాయి. చాలా కాలం క్రితం పోర్చుగీసు, స్పెయిన్‌లకు చెందిన నావికులు ఓడలపై దేశదేశాలు తిరిగేవారు. అలా వాళ్లు ఓ తీరంలో తొలిసారిగా కొబ్బరి చెట్టును చూశారు. ఆ కాయ వాళ్లకి చాలా వింతగా కనిపించి ఒలిచి చూశారు. లోపల మూడు కళ్లతో కోతి ముఖంలాగా కనిపించింది. వెంటనే ‘కోకో నట్’ అన్నారు. ఆ భాషల్లో కోకో అంటే కోతి ముఖమని అర్థం. అలా పుట్టిన ఈ పదం తొలిసారిగా 1555లో ఇంగ్లిషు నిఘంటువుల్లో చోటు చేసుకుంది.’ది ఏషియా- పసిఫిక్‌కొకోనట్‌కమ్యూనిట్’ అనే అంతర్జాతీయ సంస్థని 1969 సెప్టెంబరు 2న ఇండోనేషియా రాజధాని జకార్తాలో స్థాపించారు. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి, దాని ప్రాధాన్యాన్ని తెలపడమే దాని లక్ష్యం. ఆ సంస్థ 35వ వార్షికోత్సవం నుంచి ‘కొబ్బరి దినాన్ని’ ప్రత్యేకంగా జరుపుతోంది. కొబ్బరి ఉత్పత్తిలో ఇండోనేషియా, పిలిప్పీన్స్‌తర్వాత మూడో స్థానంలో ఉంది మన దేశమే. భారత్‌లో దీని వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నవారు కోటిమందికిపైనే. మన జాతీయ ఉత్పత్తిలో కొబ్బరి వాటా ఏడు వేల కోట్ల రూపాయలు.ఇదెక్కడ పుట్టిందనే విషయంపై అనేక వాదనలున్నాయి. దాదాపు కోటిన్నర ఏళ్ల నాటి కొబ్బరి కాయ శిలాజం న్యూజిలాండ్‌లో కనిపించడంతో అక్కడే పుట్టిందని చెబుతారు. కానీ ఉత్తర అమెరికాలోనని, ఆసియాలోనేనని, గంగానది తీరమేనని వాదనలు వినిపిస్తాయి.ఎక్కడ పుట్టినా కొబ్బరి కాయలు సముద్రాల్లో తేలుతూ ప్రయాణించి వివిధ తీరాల్లో నాటుకుని వ్యాపించాయనేది మాత్రం నిజం. సముద్రంలో 110 రోజులు ఉన్నా కూడా ఇది మొలకెత్తుతుంది. ఇప్పుడు ఏకంగా 86 దేశాల్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి.ఆరోగ్యపరంగా చూస్తే హృద్రోగాల్ని తగ్గిస్తుంది. రోగనిరోధకత పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది.అతి పెద్ద విత్తనం కొబ్బరికాయే.ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 5000 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయి అని అంచనా .అండమాన్ నికోబార్ దీవుల్లో 20వ శతాబ్దం వరకు కొబ్బరికాయల్నివస్తు మారకంగా వాడేవారు.
Check Also
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
Viral Video” ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు రాకముందు మనుషులు రవాణా కోసం గుర్రపు బండ్లను ఉపయోగించారు. సాంకేతికత పెరిగినంకా గుర్రపు …
Xiaomi Power Bank” మీరు మంచి పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం తగ్గింపుతో.. జియోమీ పవర్ బ్యాంక్
Xiaomi Power Bank” ఫోన్ అవసరాలు ఎక్కువగా ఉన్నవారు మంచి పవర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …
Xiaomi Tv” 42999 రూపాయల విలగల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివరి రోజు
Xiaomi Tv” ప్రస్తుతం అమెజాన్‌లో ఎలక్ట్రానిక్ ఫెస్టివ్ సేల్ నడుస్తోంది. ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ప్రకటించింది. మీరు …