భారత రాష్ట్ర సమితి జిల్లా ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి సోమవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. సంపత్ రెడ్డి పార్థివదేహానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ ఓదార్చరు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసాకల్పించారు. సంపత్‌రెడ్డి అకాల మరణం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపత్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని బాధపడ్డారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన సంపత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్‌ఎస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్య తదితరులు ఉన్నారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సంపత్ రెడ్డి మృతికి నివాళి అర్పించారు.
ఇవికూడా చదవండి
నెక్స్ట్ ఐటీ మినిస్టర్ ఎవరు.. ? కేటీఆర్ పై ట్విట్టర్‌లో చర్చ
టీమిండియా నెక్ట్స్ టార్గెట్ సౌతాఫ్రికా