Panchayat Elections” తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1తో గ్రామాల్లోని పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఎటువంటి కార్యచరణ ఇప్పటి వరకు రూపొందించ లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు. (Panchayat Elections) గ్రామపంచాయతీ లకు 2019లో ఎన్నికలు జరిగాయి.. 1ఫిబ్రవరి 2024 తో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. పాలకవర్గం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలి.కానీ ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో (Panchayat Elections) గ్రామపంచాయతీలకు స్పెషలాఫీసర్లను నియమించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. సర్పంచ్‌ల స్థానంలో స్పెషలాఫీసర్లు విధులు
నిర్వరించనున్నారు.
వచ్చే నెల ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్…
పిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు (Panchayat Elections) గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించలేరు. ఎంపీ ఎన్నికల తరువాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగుతాయి. మరో ఆరు నెలలు తమకే ఇన్ చార్జ్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలోనూ 2013లో ఏడాది పాటు స్పెషలాఫీసర్ల పాలన విధించారు.
అధికారులు వీరే..
తెలంగాణ రాష్ట్రంలో 12,769 (Panchayat Elections) గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రత్యేక అధికారుల ను నియమించనున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏవో, ఎంఈవో,ఆర్ డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ ఇంజనీర్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ ఐవైద్యశాఖ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించనన్నారు. మేజర్ గ్రామపంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు.
ఇవి కూడా చదవండి
పియుడి మోజులో కొడుకును చంపిన తల్లి : ఇద్దరికి జీవిత ఖైదు
TS RTC” క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ