TS RTC” క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ

TS RTC"

TS RTC” గురువారం నుంచి జరిగే భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ని వీక్షించేందుకు సిద్ధమవుతున్న క్రికెట్‌ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది.. క్రికెట్‌ మ్యాచ్‌ కోసం వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడపనుంది. జనవరి 25-29 మధ్య ఐదు రోజుల పాటు ఉప్పల్‌ స్టేడియంకు అరవై ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆర్‌జిఐసి స్టేడియం విూదుగా ఉప్పల్‌కు సాధారణ సర్వీసులతో పాటు మ్యాచ్‌ కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని ప్రజా రవాణా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు 60 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. తిరిగి 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. మ్యాచ్‌ని వీక్షించేందుకు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకోవాల్సిందిగా క్రికెట్‌ అభిమానులను ఆర్టీసీ అభ్యర్థిస్తోందని ఎండి సజ్జనార్‌ ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా ప్రకటించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Anand Mahindra” ఆనంద్ మ‌హింద్రాను ఆక‌ర్షించిన పానీపూరీ బండి: వీడియో వైర‌ల్‌

Crazy Run out” ఎం అన్నా క్యాచ్‌లు ఆడుకుంటుర్రా… సీరియ‌స్ మ్యాచ్‌లో కామెడీ

Tiger Duck Viral Video” వేటకొచ్చిన పులి… త‌ప్పించుకున్న‌ బాతు.. బిత్తిరి చూపుల‌తో పులి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *