సున్నా మార్కులు వచ్చినా సీటు ఇవ్వనున్నట్టు మెడికల్ కౌన్సెలింగ్ ఎంసీసీ ప్రకటించింది. ఈ సంవత్సరం నీట్ పీజీ ఎగ్జామ్ రాసిన వారందరికీ కౌన్సెలింగ్ చాన్స్ ఇస్తామని ఎంసీసీ పేర్కొంది. నెగటివ్( మైనస్) మార్కులు వచ్చిన అభ్యర్థులు కాకుండా మిగిలిన వారందరికీ పీజీ సీటు పొందే వీలు కల్పించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచన మేరకు, కటాఫ్ స్కోర్‌ను జీరోగా నిర్ణయించామని తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడు దాదాపు వెయ్యికి పైగా పీజీ సీట్లు మిగిలుతున్నాయి. ఇందులో నాన్ క్లినికల్, పారా క్లినికల్ సీట్లే అత్యధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కట్ ఆఫ్ తగ్గిస్తే, ఆ సీట్లన్నీ నిండుతాయని కేంద్ర ఆరోగ్యశాఖకు ఐఎంఏ ఓ లేఖ రాసింది. కటాఫ్ తగ్గించడం వల్ల నష్టం లేదని, పీజీ కోసం ఎదురుచూస్తున్న డాక్టర్లకు మేలు జరుగుతుందని కోరింది. కాగా, కొత్త కట్ ఆఫ్ నేపథ్యంలో కౌన్సెలింగ్‌లో పాల్గొనదల్చుకున్న స్టూడెంట్స్ రిజిస్టేష్రన్ చేసుకోవాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సూచించింది. ఆల్ ఇండియా కోటా మూడో రౌండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎంసీసీ తెలిపింది. జనరల్ అభ్యర్థులకు 50శాతం, దివ్యాంగులకు 45 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతం పర్సంటేజీ వస్తే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ పర్సంటేజీని ఎత్తేవేసి, నీట్-పీజీ రాసి, మైనస్ మార్కులు వచ్చినవారు తప్ప మిగిలిన అందరినీ అర్హులుగా ప్రకటించారు. శుక్రవారం తర్వాత మెరిట్ లిస్ట్ విడుదల చేసి, ఆ తర్వాత సీట్లు కేటాయింపు పక్రియ నిర్వహిస్తారు.
చదవండి ఇవి కూడా
గ్రూప్ వన్ రద్దుకు కారణాలివే..
గ్రహంతర వాసులు భూమిదికొచ్చారా..? ఆ అస్థిపంజారాలు ఏం చెబుతున్నాయి