Saturday , 22 June 2024
Breaking News

మ‌రో రెండు దేశాల మ‌ధ్య యుద్ధం

ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం ఇంకా చ‌ల్లార‌నే లేదు. మ‌రో రెండు దేశాలు యుద్దానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. అజర్‌బైజన్‌ -అర్మేనియా క‌ధ‌న‌రంగానికి కాలుదువ్వుతోంది. నాగ‌ర్నో – కార‌బ‌క్ ప్రాంతం ఈ రెందు దేశాల మ‌ధ్య వివాదానికి దారి తీసింది. అజ‌ర్‌బైజ‌న్ దేశానికి చెందిన ద‌ళాలు ఆపరేష‌న్ చేప‌ట్టాయి. ఈ ఆప‌రేష‌న్‌లో ఇప్పటి వరకు 100 మంది మరణించారు. వంద‌ల‌మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గ‌త మంగ‌ళ‌వారం ఈ ఆప‌రేష‌న్ మొద‌లైంది. ఈ ప్రాంతం నుంచి ఆర్మేనియ‌న్ల‌ను వెళ్ల‌గొట్టేందుకు ఈ దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషనేన‌ని అజర్‌బైజన్ చెప్పుకొస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న అర్మేనియన్‌ జాతీయుల హక్కులను రక్షించేందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టిన‌ట్టు చెబుతోంది. రష్యాకు చెందిన శాంతి పరిరక్షక దళాలు ఇక్కడి నుంచి 2,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. 2020 నాటి ఒప్పందానికి తక్షణమే కట్టుబడి ఉండాలని రష్యా పిలుపునిచ్చింది. ‘తైప్రాక్షిక ఒప్పందానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఈ ఒప్పందంలో నాగర్నో-కారబఖ్‌లో శాంతికి అవసరమైన అన్ని ప్రమాణాలను ప్రస్తావించారు’ అని రష్యా విదేశీ వ్యహారాలశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘర్షణల్లో గాయపడిన వారికి శాంతి పరిరక్షణ దళాలు తక్షణమే వైద్యసాయం అందించాలని సూచించింది.మరో వైపు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సెప్టెంబర్‌ 21న ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని అర్మేనియా కోరింది. నాగర్నో-కారబఖ్‌లో అర్మేనియా దళాలు ఆయుధాలు వదిలిస్తే.. తాము ఆపరేషన్‌ నిలిపివేస్తామని అజర్‌బైజన్‌ అధ్యక్షుడు వెల్లడించారు. యుద్ధం విరమించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పిలుపునకు స్పందనగా ఈ ప్రకటన విడుదల చేశారు.

చ‌ద‌వండి ఇవి కూడా

గ్ర‌హంత‌ర వాసులు భూమిదికొచ్చారా..? ఆ అస్థిపంజారాలు ఏం చెబుతున్నాయి

కారు డ్రైవ‌ర్ బ్యాంకు ఖాతాలో అక్ష‌రాల 9 వేల కోట్లు

ప్లంబ‌ర్‌గా వెళ్లి.. ఉగ్ర‌వాదిగా మారి.. రెండు దేశాల మ‌ధ్య చిచ్చుకు కార‌ణ‌మైన నిజ్జ‌ర్

 

About Dc Telugu

Check Also

Maharashtra

Maharashtra” అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం.. ప‌రుగులు పెట్టిన జ‌నం

Maharashtra” మ‌హారాష్ట్ర‌లోని ఓ అపార్ట‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. మొద‌టి అంత‌స్తులో మంట‌లు చెల‌రేగి ద‌ట్ట‌మైన పొగలు అల్లుమున్నాయి. …

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

tribal women

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com