మేం ఎప్పుడు ప్ర‌జ‌ల ప‌క్ష‌మే.. బోన‌స్‌తో వ‌డ్లు ఎప్పుడు కొంటారు మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శ‌నివారం విలేక‌రుల‌తో ఆయ‌న మాట్లాడారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని, వాళ్ళను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి రూ.15,000 డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎప్పుడు రైతుబంధు ఇస్తారో చెప్పాలని హరీష్ రావు ప్ర‌శ్నించారు.

 

వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌డుస్తున్న మాజీ సీఎం వీడియో విడుద‌ల‌

బీఆర్ ఎస్ ఎల్పీ నేత‌గా కేసీఆర్ ఎన్నిక

మంత్రుల శాఖ‌లు కేటాయింపు

కేసీఆర్ ను ఆపరేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్తున్న వీడియో

రేప‌టి నుంచే బ‌స్ ఫ్రీ .. రూల్స్ ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *