తెలంగాణ వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయలేదు. దీనిని టీఎస్‌పీఎస్సీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటి సారి పరీక్షను 16 అక్టోబర్ 2022 విజయవంతంగా నిర్వహించారు. అనంతరం మెయిన్స్‌కు సెలక్ట్ అయిన వారి లిస్టు కూడా ప్రకటించింది. కానీ క్వశ్చన్ పేపర్ల లీక్ కారణంగా అప్పుడు రద్దు అయ్యింది. ఆతరువాత 2023 జూన్ 11 రెండో సారి పరీక్షను నిర్వహించారు. ఇందులోనూ లోపాలు ఉండడంతో పలువురు అభ్యర్థులు కోర్టుకెళ్లారు.
కారణాలు ఇవే..
మొదటిసారి పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకున్నారు. కానీ రెండో సారి పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకోలేదు. అంతే కాకుండా ఓఎమ్మార్ షీట్ పై హాల్ టిక్కట్ నెంబర్ లేకపోవడం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టు కెళ్లారు. వాదోపవాదాల అనంతరం గ్రూప్ వన్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తున్నట్టు కోర్టు తీర్పు చెప్పింది.
మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కావడం తో సెలెక్ట్ అవుతామనే నమ్మకం ఉన్నవాళ్లు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు రద్దు కావడంతో అంతా గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది కష్టనష్టాలకు ఓర్చి ప్రిపేర్ అవుతున్నారు. కొంత మంది చేస్తున్నఉద్యోగాన్ని వదిలి కంప్లీట్‌గా గ్రూప్‌వన్ కోసమే చదవుతున్నారు.
చదవండి ఇవి కూడా
ఇక ‘సున్నా’ మార్కులొచ్చినా పీజీ సీటు
గ్రహంతర వాసులు భూమిదికొచ్చారా..? ఆ అస్థిపంజారాలు ఏం చెబుతున్నాయి