యాసంగి కాలానికి సంబంధించిన రైతు బంధు డబ్బులకు 28 తేదిన ఈసీ అనుమతిచ్చిన తాజాగా సోమవారం (నవంబర్ 27)న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నవిషయం తెలిసిందే. దీనిపై బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం మొదలైంది. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్)లో ఘాటుగా విమర్శించాడు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శమని రాసుకొచ్చారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దు అని భరోసా కల్పించారు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్త్తామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. .
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు.
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023
9 ఓవర్లు వేసి ఒక్క పరుగు ఇవ్వకుండా 8 వికెట్లు తీసిన పిల్లవాడు
రైతు బంధుకు బ్రేక్ ఈసీ సంచలన నిర్ణయం..
కాంతారాకు మూవీకి ప్రీక్వెల్ సన్నాహాలు మొదలు పెట్టామని ప్రకటన