Thursday , 21 November 2024

కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం మంత్రి ఉత్త‌మ్

కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. పేదలకు నాణ్యమైన రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు అవినీతిలేని పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల శాఖలో తప్పిదాలు జరిగాయని.. ఏకంగా రూ.56వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి చెప్పారు. మంగళవారం నగరంలోని సివిల్‌ సప్లై భవన్‌ లో మంత్రి ఉత్తమ్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 12 శాతం వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించడం లేదని చెప్పారు. కొందరు రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ హావిూ వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల నుంచి సివిల్‌ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సవిూక్ష అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మరింత పారదర్శకంగా ఉండాలన్నారు. 1.8 మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని, కానీ ప్రజలు వాటిని ఉపయోగించుకుంటున్నారా అన్నది మనం గమనించాలని ఆధికారుకులకు సూచించినట్లు తెలిపారు. కిలో 39 రూపాయలు పెట్టి బియ్యం సేకరించి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని.. కానీ, అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందని అన్నారు. మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకంగా ఉంటుందో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రేషన్‌ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని.. పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విదంగా ఉండాలి తప్ప.. దుర్వినియోగం కావొద్దని అన్నారు. మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించామని తెలిపారు. సచివాలయంలో యాసంగి, వర్షాకాంలో ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లింగ్‌ సామర్థ్యం, బియ్యం నాణ్యత అధికారులు మంత్రికి వివరించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పారు.

విరుష్క బంధానికి ఆరేండ్లు..

కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాం : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

హాయ్ నాన్న మనసుకు హత్తుకునేలా ఉంది

About Dc Telugu

Check Also

21.11.2024 D.C Telugu Morning News

21.11.2024 D.C Telugu Cinema News

Viral Video

Viral Video” ఒక‌రిని చూసి మ‌రొక‌రు.. కింద‌వ‌డి న‌వ్వుల‌పాలు వీడియో వైర‌ల్

Viral Video” తోటి వ్య‌క్తి తొడ కోసుకుంటే మ‌నం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత‌.. అచ్చం అలాగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com