రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా హాలియా మండలం వెంకటపూర్‌లో మంగళవారం తెల్లవారంగా చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద (ఎస్సీఎఫ్) కానిస్టేబుల్గా విధులు నిర్తర్తిస్తున్న మధు మంగళవారం తెల్లవారంగా నల్గొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెంకటపూర్‌కు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం మధు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధు స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని ఆరెగూడెం. మధు మరణ వార్త తెలుసుకున్న ఆరెగూడెం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
కరీంనగర్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
కరెంట్ ఉండదు ఫోన్లు చార్జింగ్ పెట్టుకోండి.. గాజా సిటీ ని చుట్టుముట్టిన ఇజ్రాయిల్