గత నాలుగు రోజుల హమాస్, ఇజ్రాయిల్ మధ్య బీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరువర్గాల్లో 2000 మంది వరకు మృతి చెందినట్టు సమాచారం. 5 వేల రాకెట్లతో విరుచుకపడిన హమాస్ సంస్థను వీడిచిపెట్టదేలేదని ఇజ్రాయిల్ ప్రతినబూనింది. గాజా సిటీని అన్నిరకాలుగా చుట్టుముడుతున్నట్టు ఇజ్రాయిల్ ప్రకటిస్తోంది. ఇప్పటికే గాజా సిటీలో ఉన్న హమాస్ కేంద్రాలపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ రక్షణ శాఖమంత్రి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. గాజా స్ట్రిప్ దిగ్భందిచేందుకు ఆదేశించినట్టు చెప్పారు. గాజా సిటీలో ఇంధనం, కరెంటు, తిండి ఉండదని అన్నీ మూసేస్తారని చెప్పారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ… ఉగ్రవాద సీక్రెట్ స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పారు. మరో వైపు అమెరికా ఇజ్రాయిల్ కు పూర్తి మద్దతు ప్రకటించింది. యుద్దనౌకలను కూడా ఇజ్రాయిల్‌కు పంపారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్దంతో ప్రపంచం చాలా వరకు స్థంభించిపోయింది. ఈ యుద్ధంతో కూడా ప్రపంచ దేశాలపై ప్రభావం పడనుంది.
నవంబర్ 30న తెలంగాణాలో ఎన్నికలు..
కరీంనగర్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
5 వేల రాకెట్లతో రక్తపాతం సోషల్ మీడియాలో వీడియోలు విడుదల
5 వేల రాకెట్లతో రక్తపాతం సోషల్ మీడియాలో వీడియోలు విడుదల