భాయ్ అని పిలువలేదని ఇద్దరిని కాల్చి చంపిన ఘటన ఢిల్లీలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘు, జాకీర్, భూరా అనే ముగ్గురు ఢిల్లీలోని అశోక్ విహార్ అనే ఏరియాకు వెళ్లారు. అక్కడ డబ్లూ అనే వ్యక్త గురించి వెతుకుతున్నారు. ఈ క్రమంలో స్థానిక వ్యక్తిని డబ్లూ గురించి అడిగారు. దీంతో ఆ వ్యక్తి డబ్లు అనొద్దు, డబ్లూ భాయ్ అనాలని చెప్పాడు. ఈ విషయంలో స్థానిక వ్యక్తికి ఆ ముగ్గురికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కొట్లాట పెద్దది కావడంతో డబ్లూ తన ఇంట్లో నుంచి బయటకు రాగానే రఘు డబ్లూపై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన డబ్లు సహచరులు కాల్పులు జరిపారు. దీంతో రఘుకు తీవ్రగాయాలు కావడంతో స్పాట్లోనే చనిపోయాడు. దీంతో జాకీర్, భూరాలు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా వారి వెంట పడి భూరాన పట్టుకున్నారు. భూరాను డబ్లు మనుషులు
కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. జాకీర్ మాత్రం తప్పించుకుని పారిపోయాడు.