ఆర్టీసీ బ‌స్సు ఆటో ఢీ న‌లుగురు మృతి

ఆటో ఆర్టీసీ బ‌స్సు ఢీకొన‌డంతో న‌లుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా ఎర్రగుంట్ల బైపాస్ ద‌గ్గ‌ర ఆటో ఆర్టీసీ బ‌స్సు ఢీకొన్నాయి. ఆటోలో ప‌దిమంది ఉండ‌గా న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఆరుగురు గాయాలయ్యాయి. మహమ్మద్‌ (25 ), షాకీర్‌ (10), హసీన (25), అమీన (20) మ‌ర‌ణించిన వారిలో ఉన్నారు. గాయ‌ప‌డ్డ ఆరుగురిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ద‌వాఖానాకు తీసుకెళ్లారు. వీళ్లంద‌రూ క‌డ‌ప ప‌ట్ట‌ణంల‌ని ఆజాద్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన‌వారు. వీళ్లు క‌డ‌ప నుంచి ప్రొద్దూటూరు వెళ్లారు. అక్క‌డి నుంచి మ‌ల్లెల పోతున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

..క‌రెంట్ ఉండ‌దు ఫోన్లు చార్జింగ్ పెట్టుకోండి.. గాజా సిటీ ని చుట్టుముట్టిన ఇజ్రాయిల్‌

5 వేల రాకెట్ల‌తో ర‌క్త‌పాతం సోష‌ల్ మీడియాలో వీడియోలు విడుద‌ల

క‌రీంన‌గ‌ర్ సిటీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *