Rythu Bandhu” వ్యవసాయం చేసుకునే వాళ్లకు మాత్రమే రైతుబంధును ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పడావు భూములకు, కొండలు, గుట్టలు, రోడ్లకు (Rythu Bandhu) రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. గతంలో రైతుబంధును బీఆర్ ఎస్ ప్రభుత్వం ఐదు నెలలపాటు ఇచ్చిందన్నారు. తాము వారి కంటే తక్కువ టైంలోనే అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం విూడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నామన్నరు. ఇచ్చిన హావిూలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 12న మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మార్చి 1న జీతాలు ఇచ్చాం’ అని వివరించారు. బీఆర్‌ఎస్ హయాంలో యాసంగి రైతుబంధు 4 నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. గతంలో రైతుబంధును బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు నెలలపాటు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం (Rythu Bandhu) రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా రైతులకు (Rythu Bandhu) రైతుబంధు అందకుంటే ఈ నెలఖారులోపు పూర్తి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
Congress First List” 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
Lpg Cylinder Prices” వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. విపక్షాలు ఏమన్నాయంటే…?