Thursday , 12 September 2024
Breaking News

తుమ్మల చేరిక 5న ..?

ముహూర్తం ఖ‌రారు అంటూ ప్రచారం
సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
హైదరాబాద్ ద‌క్క‌న్ తెలుగు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని, ముమూర్తం కూడా ఫిక్స్‌ అయ్యిందని అంటున్నారు. ఈ నెల 5న ఆయన అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సీనియర్‌ నేత మల్లు రవి… గురువారం తుమ్మల ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రేవంత్‌ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి తుమ్మల… 5న కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారని సమాచారం. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాలేరు అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హావిూ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ లో చేరితే…పార్టీ మరింత బలోపేతమవుతుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో రాజకీయ అనుబంధం తెంచుకోలేనిదని ఇటీవల తుమ్మల అన్నారు. ఇటీవల ఆయన అనుచరులు వెయ్యి కార్లు, రెండు వేల బైక్‌ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల అభిమానం, ఆత్మీయత, ఆవేదన చూసిన తర్వాత ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు రాజకీయాలు అవసరం లేకున్నా… ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎన్నోసార్లు కిందపడ్డా ప్రజలు మళ్లీ నిలబెట్టారని… జిల్లాలో పుట్టిన మహా నేతలకు దక్కని గుర్తింపు తనకు దక్కిందన్నారు. పాలేరు గోదావరి జలాలు తీసుకురావడమే తన లక్ష్యమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తన ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. గోదావరి జలాలతో విూ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని అన్నారు. విూతో శభాష్‌ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ ఎవరికి తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని.. జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సొంత గడ్డ… సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తుమ్మల మొదటి సారి ఓటమి పాలైనా..ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తుమ్మల నాగేశ్వరరావు మొత్తం ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 2016లో బీఆర్‌ఎస్‌ లో చేరి…టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అసెంబ్లీకి పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన…కాంగ్రెస్‌ అభ్యర్థి ఉపేందర్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 1983 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన…1985 ఎన్నికల్లో తొలిసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్‌, చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల , ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు కేబినెట్‌ లో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత… కెసిఆర్‌ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేశారు.

చ‌ద‌వండి ఇవి కూడా

మోడీ హ్య‌ట్రిక్

63 మంది మంట‌ల్లో కాలిపోయారు

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video” అదిరంద‌య్యా.. లేటెస్ట్ గుర్ర‌పు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైర‌ల్‌

Viral Video”   ద్విచ‌క్ర‌వాహ‌నాలు, ఆటోలు, జీపులు రాక‌ముందు మ‌నుషులు ర‌వాణా కోసం గుర్ర‌పు బండ్ల‌ను ఉప‌యోగించారు. సాంకేతిక‌త పెరిగినంకా గుర్ర‌పు …

Xiaomi Power Bank

Xiaomi Power Bank” మీరు మంచి ప‌వ‌ర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం త‌గ్గింపుతో.. జియోమీ ప‌వ‌ర్ బ్యాంక్

Xiaomi Power Bank” ఫోన్ అవ‌స‌రాలు ఎక్కువ‌గా ఉన్నవారు మంచి ప‌వ‌ర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …

Xiaomi Tv

Xiaomi Tv” 42999 రూపాయ‌ల విల‌గ‌ల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివ‌రి రోజు

Xiaomi Tv” ప్ర‌స్తుతం అమెజాన్‌లో ఎల‌క్ట్రానిక్ ఫెస్టివ్ సేల్ న‌డుస్తోంది. ఎన్నో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై భారీ త‌గ్గింపు ప్ర‌క‌టించింది. మీరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com