నాగపూర్‌లో దారుణ ఘటన
నాగపూర్ :
ఇంటి పనులు చేసే బాలికను దంపతులు చిత్రహింసలకు గురి చేశారు . సిగరెట్, కాల్చిన అట్లకాడతో ఆమె శరీరంపై వాతలు పెట్టారు. అలాగే ఊరికి వెళ్లిన ఆ దంపతులు ఆ బాలికను తమ ఇంట్లో నిర్బంధించారు. పవర్ కట్ వేళ ఆ బాలిక భయంతో కేకలు వేయగా చిత్రహింసల విషయం బయటపడింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. అథర్వ నగరి హౌసింగ్ సొసైటీలో నివసించే దంపతులు ఇంటి పనుల కోసం మూడేండ్ల కిందట 12 ఏండ్ల బాలికను బెంగళూరు నుంచి తెచ్చారు. మంచిగా చూసుకుంటామని, చదివిస్తామని బాలిక తల్లిదండ్రులకు హావిూ ఇచ్చారు. కాగా, ఆ బాలికతో ఇంటి పనుల చాకిరి చేయిస్తున్న ఆ దంపతులు ఆమెను టార్చర్ చేశారు. తప్పులు చేసినప్పుడు దారుణంగా హింసించారు. కాలిన సిగరెట్, కత్తిని కాల్చి, అలాగే కాలిన అట్లకాడతో వీపుపై వాతలు పెట్టేవారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక శరీరంపై కాలిన గాయాలున్నాయి. మరోవైపు ఆ దంపతులు ఇటీవల బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ బాలికను ఒంటరిగా ఇంట్లో ఉంచి తాళం వేశారు.
చదవండి ఇది కూడా
అయితే కరెంట్ లేని సమయంలో ఆ బాలిక సహాయం కోసం కిటికీ నుంచి కేకలు వేసింది. గమనించిన పొరుగువారు ఆ ఇంటి డోర్‌ను బద్ధలుకొట్టి ఆ బాలికను రక్షించారు. ఒక ఎన్జీవో సంస్థకు ఆమెను అప్పగించారు. ఆ బాలిక శరీరంపై కాలిన గాయాలు ఉండటం చూసిన ఎన్జీవో సంస్థ సిబ్బంది దీని గురించి ఆరా తీశారు. ఇంటి పనులు చేయిస్తున్న దంపతులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆమె చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ ఉన్న దంపతులను అరెస్ట్ చేసి నాగపూర్ పోలీసులకు అప్పగించారు.
చదవండి ఇది కూడా