63 మంది మంట‌ల్లో కాలిపోయారు

జోహాన్స్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం
మంటల్లో తగులబడ్డ నివాస సముదాయం
63మంది సజీవ దహనం..40మందికి పైగా గాయాలు

దక్షిణాఫ్రికాలో అతి పెద్ద నగరమైన జోహన్స్‌బర్గ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. జోహన్స్‌బర్గ్‌లోని ఒక అతి పెద్ద రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవ దహనం అయ్యారు. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ భవనంలో దాదాపు 200 మందికి పైగానే నివాసం ఉంటున్నట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. అత్యంత విషాదం ఏంటంటే.. ఒక సంవత్సరం వయసున్న పిల్లాడు కూడా మంటల్లో సజీవ దహనమైనట్లు దక్షిణాఫ్రికా విూడియా పేర్కొంది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారి మాట్లాడుతూ.. ఆ బిల్డింగ్‌లో ఎలాంటి లీజ్‌ అగ్రిమెంట్స్‌ లేకుండా ఇల్లు లేని చాలా మంది ఉంటున్నారని, దీంతో ఎవరెవరు అక్కడ ఉంటున్నారో గుర్తించడం సవాల్‌గా మారిందని చెప్పారు. తన 20 ఏళ్ల సర్వీస్‌లో ఇంత ఘోర అగ్ని ప్రమాదాన్ని చూడలేదన్నారు. జోహన్స్‌బర్గ్‌ నగరానికే హృదయం లాంటి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్టిక్ట్‌ల్రో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఇలాంటి ఊరూపేరూ లేని బిల్డింగ్స్‌ చాలానే ఉన్నాయని, వాటిని సిటీ అధికార యంత్రాంగం ‘హైజాక్డ్‌ బిల్డింగ్స్‌’గా భావించి వదిలేస్తుందని స్థానిక విూడియా తెలిపింది. చలికి తట్టుకోలేక ఆ బిల్డింగ్‌లో ఎవరో ఒకరు మంట వేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *