Saturday , 27 July 2024
Breaking News

మోడీ హ్య‌ట్రిక్

మెజార్టీ ప్రజలంతా నమో
భారతీయుల్లో మోదీ పట్ల వైఖరి ఏమాత్రం చెక్కుచెదరలేదని, అది మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇకపోతే ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిపినా మళ్లీ మోడీనే భారీ మెజార్టీతో గెలుస్తారని అంచనాలు. ప్రధానంగా వారసత్వ రాజకీయాలు లేకపోవడం, కటుంబపాలన ఛాలు లేకుండా ఉండడం కలసి వచ్చింది. అన్నింటికి మించి విదేశాల్లో భారత ప్రతిష్టను బాగా ఇనుమడింప చేశారన్న ప్రతిష్ట వచ్చింది. మొత్తంగా గతంతో పోలిస్తే విదేశాల్లో భారీతీయ ప్రతిష్ట పెరగడమే గాకుండా అనేక దేశాలు మనతో స్నేహహస్తం సాచాయి. ప్రధానంగా గల్ఫ్‌ దేశాల్లో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రతిష్ట ఇనుమడించింది. ఆర్థిక మందగమనం ఎలా ఉన్నా దేశంలో సమర్థమైన పాలన సాగేలా మోడీ తీసుకుం టున్న చర్యలు దేశంలోనే గాకుండా, ప్రపంచంలోనూ ప్రశంసలు వస్తున్నాయి. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలతో స్నేహం చెడకుండా వాటితో బంధాన్నికొనసాగిస్తున్న తీరు మోడీ చాతుర్యానికి నిదర్శనంగా చూడాలి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం మోడీ ప్రభుత్వాని కే సాధ్యమయ్యింది. ప్రజల కోసం పని చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వంగా మోడీ నిరూపిం చుకున్నారు. మోదీ సారథ్యంలోని రెండో ప్రభుత్వం ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన విజయాలను సాధించింది. అన్నింటికి మించి 370 ఆర్టికల్‌ రద్దు చేయడం, కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పడం, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌ను ప్రపంచంలో ఏకాకి చేయడం అన్నది అద్భుతమైన విజయంగా చూడాలి. అది బిజెపి మాత్రమే చేయగలదని నిరూపించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏడు దశాబ్దాలుగా అపరిష్కృతంగావున్న కశ్మీర్‌ సమస్యను ప్రధాని మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో అనితరసాధ్యంగా పరిష్కరించింది. ఆర్టికల్‌ 370 రద్దుతో 2019 ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోతుంది. పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతాయనడంలో సందేహం లేదు. మోదీ సర్కార్‌ తీసుకున్న సాహసోపేతమైన ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తరవాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంలోనే కాక విదేశాల్లో సైతం బ్రహ్మరథం పడుతు న్నారు. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో ఆయనకు ఎర్ర తివాచి పరుస్తు న్నారు. బహ్రెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారా లను మోదీకి ప్రదానం చేశాయి. దీంతో కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ అంతర్జాతీయ సమాజంలో పూర్తిగా ఏకాకి అయ్యింది. ఇది మోదీ రాజనీతిజ్ఞతకు ఒక తిరుగులేని నిదర్శనంగా చూడాలి. ఇదే క్రమంలో అవినీతి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అవినీతి నేతలను బొక్కలో తోయడానికి మోడీ వెనకాడడని నిరూపించారు. ఇలా రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని దోచుకున్న నేతలను అరెస్ట్‌ చేసినా, కేసులు పెట్టినా ప్రజలు జేజేలు పలుకుతారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ పలు కీలక నిర్ణయాలను తీసుకోవడమే గాకుండా వాటిని అమలు చేసి చూపారు. చంద్రాయాన్‌ సక్సెస్‌ కావడం ఆకాశమంత విజయంగా చూడాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇదో మైలురాయి. ఈ స్ఫూర్తితో ఆదిత్య మిషన్‌ ప్రారంభం అయ్యింది. ప్రపంచంలో ఇస్రో ఘనత పెరిగింది. ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా మోడీ అండగా ఉన్నారు. భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్‌ విజయవంత కావడం మనకు గర్వకారణం. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై పరిశోధనలు చేశాయి. చంద్రయాన్‌-3తో ఆ దేశాల సరసన భారత్‌ కూడా చేరింది. సంస్కరణల్లో వేగం, ప్రతి ఒక్కరికీ సంక్షేమం, సామాజిక న్యాయం వంటి విషయాల్లో మోదీ సర్కార్‌ మొదటి విడత పాలనలో కంటే ఈ వంద రోజుల్లోనే విశేష స్థాయిలో
సత్ఫలితాలు సమకూరాయి. ఇకపోతే ముస్లిం మహిళలకు రక్షణగా ట్రిపుల్‌ తలాక్‌ రద్దుకూడా అతిపెద్ద విజయంగానే చూడాలి. భారతదేశంలోని ముస్లిం మహిళలకు సామాజిక ప్రతిష్ఠను, గౌరవ మర్యాదలను అందించేందుకై మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ చట్టం నిదర్శనంగా చూడాలి. ఈ విజయాలను చూస్తున్న ప్రజలు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి కావాలని కోరుకుంటున్నారు. అలాగే రాజకీయా సంస్కరణలు కూడా కోరుకుంటున్నారు. దేశంలో అవినీతి రహిత రాజకీయాలను ప్రజలు కోరుకుం టున్నారు. ఈ దిశగా మోడీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తే ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ రెండో ప్రభుత్వం సాహసో పేతమైన నిర్ణయాలతో పురోగమించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే దేశరక్షణ వ్యవస్థలో ఒక అతి పెద్ద సంస్కరణకు మోదీ సర్కార్‌ పూనుకున్నది. ఫలితంగా ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, పాలనా దక్షతపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీర్ఘకాల ప్రయోజనాలపైనే మోదీ సర్కార్‌ దృష్టిని కేంద్రీకరించింది. ఈ క్రమంలో దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఇంకా యుద్దంచేయాల్సి ఉంది. అవినీతి రహిత పాలనతో పాటు రాజకీయ అవినీతిని పారద్రోలాలి. రాజకీయాల్లో వారసత్వాన్ని రూపుమాపాలి. ఒకేదేశం, ఒకే చట్టం అన్ననినాదం రావాలి. జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ సాకారం చేసే దిశగా అడుగులు వేస్తే మోడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాగా భారత్‌ బలమైన దేశంగా ఎదుగు తుంది. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రజల్లో కూడా సానుకూలత భారీగా ఏర్పడింది. అందుకే ఇప్పుడంతా నమో అంటున్నారు.

రెండో తారీఖున సూర్యుడిమీద‌కు.. 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల ప్ర‌యాణం

About Dc Telugu

Check Also

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Delhi News

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Delhi News” కొన్ని దారుణ ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగ‌త‌నాలు, దాడులు ఎక్కువ‌గా రాత్రే జ‌ర‌గుతుంటాయి. అవి కూడా …

Mumbai Local Train

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com