అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే స్థానాలకు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో టికెట్ రానివాళ్లు పార్టీలు మారడం, అసంతృప్తితో ఆయా పార్టీల మీద దుమ్మెత్తిపోయడం లాంటివి చేస్తున్నారు. మరికొందరు వివిదరూపాల్లో నిరసన తెలుపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించిన దిల్లి వసంత్‌కు టికెట్ రాకపోవడంతో స్మశానంలో నిద్రించి తన నిరసన వ్యక్తం చేశారు. ఈయన బీజేపీ, బీఆర్ ఎస్ రెండు పార్టీల నుంచి టికెట్ ఆశించారు. అయినప్పటికీ టికెట్ రాలేదు. ఈ క్రమంలో ఈ విధంగా నిరసన తెలిపారు. చెరుకు రైతుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈయన ఢిల్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. తాను ఢిల్లీ పాదయాత్ర చేసేందుకు కారణమైన రైతు చాకలి దశరథ్ సమాధి వద్ద రాత్రి నిద్ర, జాగరణ చేశారు.
ఇవి కూడా చదవండి
ఎంఐఎం అభ్యర్థులు వీరే.. కొత్తగా రెండు స్థానాల్లో పోటీ, పాతోళ్లు ఇద్దరు పోటికి దూరం
పొలంలో కరెంట్ తీగ.. లాగితే భార్య డొంక కదిలింది
బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..