కారులో లిక్క‌ర్‌.. అందిన‌కాడికి సంక‌లేసుక‌పోయారు. వీడియో వైర‌ల్

రోడ్డుమీద ప్ర‌మాదాలు జరుగుతుంటాయి.. కొన్ని సంద‌ర్భాల్లో అక్క‌డున్న వాహ‌నాల్లోని స‌రుకుల‌ను లూటీ చేసిన ఘ‌ట‌నలు ఎన్నో చూసినం. కానీ అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. సాయం చేద్దామ‌ని వెళ్లిన వారికి అందులో మ‌ద్యం బాటిళ్లు ఉండ‌డంతో అక్క‌డి జ‌నం అందికాడికి సంక‌లో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న అక్టోబ‌ర్ 30న బీహార్ రాష్ట్రంలో జ‌ర‌గ‌గా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో 2016 ఏప్రిల్ 5 నుంచి మ‌ద్య‌పానం నిషేధం ఉంది. అయితే కొంత మంది కేటుగాళ్లు మెడిసిన్ పేరుతో విదేశీ మ‌ద్యాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విదేశీ మ‌ద్యాన్ని త‌ర‌లిస్తున్న ఓ కారు అతివేగంగా వెళ్తూ ముందున్న కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నిందితులు మ‌ద్యాన్ని అక్క‌డే వ‌దిలేసి పారిపోయారు. ఏం జ‌రిగిందో చూద్దామ‌ని పోయిన స్థానికుల‌కు మ‌ద్యం బాటిళ్లు క‌న‌బ‌డ‌డంతో అందికాడికి తీసుకుని పరుగెత్తారు. జాతీయ ర‌హ‌దారి కావ‌డంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డి వెళ్లి నిందితుల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కారులో నుంచి మ‌ద్యం తీసుకెళ్లిన వారిపై కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అక్క‌డి ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

ఎంఐఎం అభ్య‌ర్థులు వీరే.. కొత్త‌గా రెండు స్థానాల్లో పోటీ, పాతోళ్లు ఇద్ద‌రు పోటికి దూరం

బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..

పొలంలో క‌రెంట్ తీగ‌.. లాగితే భార్య డొంక క‌దిలింది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *