Wednesday , 19 June 2024
Breaking News

Up tractor” భ‌క్తులతో వెళ్తున్న ట్రాక్ట‌ర్ చెరువులో బోల్తా… 7మంది చిన్నారులు సహా 15 మంది దుర్మ‌రణం

Up tractor” ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్‌గంజ్‌ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాటియాలీ పోలీస్‌ స్టేషన్ ప‌రిధిలో దర్యాగంజ్‌లో గ‌ల చెరువులో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 మంది చిన్నారులు సహా 15 మంది మరణించారు. (Up tractor) ట్రాక్టర్‌ ట్రాలీలో 30 మందికి పైగా భక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ భక్తులందరూ మాఘ పౌర్ణమి సందర్భంగా కదర్‌గంజ్‌ ఘాట్‌లో గంగాస్నానం చేసి తిరిగి వస్తున్నారు. ట్రాక్టర్‌ ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడడంతో పెను ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం డీఎం, ఎస్పీ సహా సీనియర్‌ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి మతదేహాలను బయటకు తీశారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. (Up tractor)  ట్రాలీలో ప్రయాణీస్తున్న వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలున్నారు. మృతులో 8 మంది మహిళలు, 7 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను తొలుత జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొంత మంది భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మరో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు రోదనలతో మిన్నంటాయి… కస్గంజ్‌ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కస్గంజ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత హదయ విదారకరమని తెలిపారు. మతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని చెప్పారు. క్షతగాత్రులందరికీ ఉచిత వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని సీఎం యోగి చెప్పారు.ట్రాక్టర్‌ ట్రాలీలో 30 మంది ప్రయాణిస్తున్నట్లు కస్గంజ్‌ డీఎం సుధా వర్మ తెలిపారు. 15 మంది చనిపోయారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది చెరువులో చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

 

Medaram sammakka” ప‌చ్చ‌ని అడ‌వి ప‌ర‌వ‌శించి ఆడే..

BRS Mla lasya Nandita” మొన్న ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డి… నేడు మ‌రో ప్ర‌మాదంలో మృతి

Ts Rtc Bus” సీట్ల‌పై నుంచి న‌డిచి టిక్కెట్టు.. వీడియో పోస్టు

hyderabad Police” మీది మొత్తం వెయ్యి అయ్యింది.. పోలీసుల మీమ్ వైర‌ల్ .. యూజ‌ర్ చార్జీలు ఎక్స్ ట్రా

About Dc Telugu

Check Also

Snake Viral Video

Snake Viral Video” వామ్మో పాము.. కొరియ‌ర్‌లో వ‌చ్చిన విషపూరిత పాము

Snake Viral Video” ఏది కొనాల‌న్నా ఈ మ‌ధ్య ఆన్‌లైన్‌లోనే కొంటున్నాం. ఆర్డ‌ర్ పెట్ట‌డం పార్సిల్ రాగానే తీసుకోవ‌డం ఎటువంటి …

Bridge Collapsed

Bridge Collapsed” కండ్ల ముందే కుప్పుకూలిన బ్రిడ్జి.. వీడియో వైర‌ల్

Bridge Collapsed” న‌దిపై నిర్మిస్తున్న బ్రిడ్జి కండ్ల ముందే కూలిపోయింది. (bihar) బీహార్ రాష్ట్రంలోని అరారియాలోని సిక్తి బ్లాక్ ఏరియాలోని …

Pawan Kalyan

Pawan Kalyan”బెంగాల్ రైలు ప్ర‌మాదంపై.. కేంద్రానికి రిక్వెస్ట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan” పశ్చిమ బెంగాళ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్ర‌మాదంపై  (AP Deputy CM) ఏపీ డిప్యూటీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com