ఇంటర్మీడియట్ విద్యార్థలు వార్షిక పరీక్ష ఫీజు తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ లో అటెండెన్స్ మినహాయింపు పొందిన ప్రయివేట్ అభ్యర్థులతో పాటు, ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి, రెండవ సంవత్సరం అన్ని కోర్సుల విద్యార్ధులు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఫెయిల్ అయిన వారు కూడా వార్షిక పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేశారు. ఈ నెల (అక్టోబర్ ) 26 నుంచి నవంబర్ 14 వరకు ఫీజులు చెల్లించొచ్చు. నవంబర్ 14 నుంచి నవంబర్ 23 డేట్ వరకు 100 రూపాయల లేట్ ఫీజుతో, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు 500 ఆలస్య రుసుంతో,డిసెంబర్ 6 వ తేది నుంచి 13 వ తేదీ వరకు రూ. 1000 లేట్ ఫీజుతో డిసెంబర్ 15వ తేది నుంచి డిసెంబర్ 20 వ తేదీ వరకు రూ. 2 వేల
లేట్ ఫీజుతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు రూ. 510, వొకేషన్ రెగ్యులర్ విద్యార్థులకు 730, రెండవ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 510, ద్వితీయ సంవత్సరం సైన్స్, ఒకేషన్ విద్యార్థులు రూ. 730 చొప్పున చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Check Also
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Viral Video” తోటి వ్యక్తి తొడ కోసుకుంటే మనం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత.. అచ్చం అలాగే …