దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్ డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ.. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. తుర్కియే పేరు మార్పు విషయంలో ఆ దేశ ప్రభుత్వం నుంచి మాకు ఒక అధికారిక విజ్ఞప్తి అందింది. అదే రీతిలో మరేదైనా విజ్ఞప్తి వచ్చినా మేము పరిగణిస్తాం అని ఫర్హాన్ హక్ అన్నారు. ఇండియా తన పేరును భారత్‌గా మార్చబోతోదంటూ వస్తున్న రిపోర్టులపై ప్రశ్నించిగా ఆయన ఈ విధంగా స్పందించారు. జీ20 సదస్సులో పాల్గొనబోయే అతిథులకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము డిన్నర్ ఆహ్వానాన్ని పంపారు. ఇందులో ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొనడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌కు మార్చబోతున్నారని, ఇప్పుడంతా అవసరం ఏముందని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలావుండగా ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పందించారు.
చదవండి ఇదికూడా
ఇండియాపై పేటెంట్ మాదే పాక్ విూడియాలో కథనాలు
భారత్ పేరు మార్పు వివాదంలో విషయంలో రాజకీయాలకు తావివ్వొద్దని, జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. భారత్ అనేది దేశానికి పూర్వం ఉన్న పేరేనని, కాబట్టి జాగ్రత్తగా వివాదాలకు పోకుండా మాట్లాలని సూచనలు చేశారు.
చదవండి ఇదికూడా