Variety Marriage Card” కరీంనగర్ ః పెండ్లి అనేది జీవితంలో మరువలేని అపూర్వ ఘట్టం. ఒక్కొక్కరూ తమ అభిరుచికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అదే కోవకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థలో సబ్ ఎడిటర్ కం కంటెంట్ డెవలపర్‌గా పనిచేస్తున్న మధు తన వివాహ ఆహ్వాన పత్రాన్ని విభిన్నంగా రూపొందించుకున్నారు. అచ్చ తెలంగాణ భాషలో… కరీంనగర్ యాసలో పదాల కూర్పు చేశారు. పోకలొల్ల లగ్గం పిలుపు అని టైటిల్ నుంచి ప్రారంభించి అన్ని పదాలు తెలంగాణ మాండలికంలోనే పూర్తి చేశారు. ఉదయాన్ని అంబటాళ్ల అని, అదివారాన్ని ఐతారమని రాసుకొచ్చారు. పిల్ల, పిల్లగాని లగ్గం చేసేందుకు అటోళ్లు, ఇటోళ్లు ఖాయం చేసిర్రంటూ.. యాదిమరిచిపోకుర్రి, యాల్లపొద్దుగాల, నిండుదీవెనర్తలతో, మా మనస్సు నిమ్మలమైతది అంటూ అక్షరాలను తీర్చిదిద్దారు. ఆహ్వానించే వారు స్థానంలో పిలిసిటోళ్లని.. సహా ఆహ్వానం స్థానంలో అరుసుకునేటోళ్లని రాయడం అందరినీ ఆకర్షిస్తోంది. లగ్గం ఏడంటే, కురాళ్లుపట్టుడు, మానెఅదినెలు, మానె కోడళ్లు, చిన్నబాపు, చిన్నమ్మలంటూ అచ్చ తెలంగాణ భాషలో పదాలను వడబోసి తన వివాహ ఆహ్వాన పత్రాన్ని తానే స్వయంగా రూపొందించుకోవడం ఆకట్టుకుంటోంది. ఈ వివాహ పత్రం పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మీరు చదివేయండి మరి..
తెలంగాణ భాషలో డిఫ్రెంట్ మ్యారెజ్ కార్డ్
పెండ్లి అనేది జీవితంలో మరువలేని అపూర్వ ఘట్టం. ఒక్కొక్కరూ తమ అభిరుచికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అచ్చ తెలంగాణ భాషలో… కరీంనగర్ యాసలో పదాల కూర్పు చేశారు. pic.twitter.com/gPj43PMMO1— Dc telugu (@DTelugu96985) August 14, 2024