Nepal Accident” నదిలో ప‌డ్డ బస్సు 14 మంది మృతి.. నేపాల్‌లో ప్రమాదం..

Nepal Accident

Nepal Accident” నేపాల్ దేశంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన బస్సు నేపాల్‌లోని తనహున్ జిల్లా ఫోఖారా నుంచి ఖాఠ్మాండుకు వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు బ‌స్సులో 69 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్టు స‌మాచారం. అందులో 40 మంది ఉత్త‌ర ప్ర‌దేశ్ చెందిన వారు ఉన్న‌ట్టు నేపాల్ పోలీసులు పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది మృతి చెందిన‌ట్టు వారి మృత దేహాల‌ను వెలికి తీసిన‌ట్టు స‌మాచారం. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు అక్క‌డి వారితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు యూపీ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి

Variety Marriage Card” ఈ పిలుపు బాగుందండీ… తెలంగాణ భాష‌లో, క‌రీంన‌గ‌ర్ యాస‌లో

Kumaradevam Tree” ఆ చెట్టు మ‌ర‌ణించింది… మూడు వంద‌ల సినిమాల్లో న‌టించిన చెట్టు

Rajastan Viral Video” డ్యాన్స్ చేస్తూ చ‌నిపోయిన టీచ‌ర్‌.. వీడియో వైర‌ల్

Kanpur Accident” కారుతో మైన‌ర్ల స్టంట్‌.. స్కూటీకి ఢీ కొడితే త‌ల్లి మృతి.. కూతురు సీరియ‌స్‌.. సీసీ వీడియో

Pune Crime news” అయ్యో త‌ల్లీ… గేటు మీద‌ప‌డి చిన్నారి మృతి.. సీసీ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *