ఇసుకపై బ్యారేజీలు కట్టే టెకాశీలజీని ఈ భూప్రపంచంలో తాను ఎక్కడా చూడలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి సంబంధిత కాంట్రాక్టులు ఇప్పించిన వారిపై, మంత్రులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై పెట్టిన ధన్యవాద తీర్మానానికి సీఎం ఆయన హాజరై మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఇసుకపై నిర్మించడం వల్లే కుంగిపోయిందని ఇది ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. దీని ఫలితంగా రూ. లక్ష కోట్ల ప్రజా ధనం వృథా అయిందఁ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించామని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టులు దశాబ్దాలుగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని చెక్కు చెదరకుండా సజీవంగా ఉన్నాయని వివరించారు. మూడేండ్ల క్రితం నిర్మించిన మేడిగడ్డ కుంగిపోయి, అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టమాని అనడం సిగ్గు చేటని విమర్శించారు. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత మొత్తం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను తీసుకెళ్లి చూపిస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
మరణ కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు.. చాలా సంతోషం.. సీఎంకు మాజీడీఎస్పీ నళిని బహిరంగ లేఖ
బీఆర్ ఎస్ నాయకుల పాస్‌పోర్టులను సీజ్ చేయాలి : బండి సంజయ్
పీఎం నరేంద్ర మోడీ వాగ్ధానాన్ని విస్మరించారు: న్యూడెమెక్రసి