తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల నియామవళి కఠినంగా అమలు చేస్తున్నారు. అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఓటర్ల ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. తెలంగాణాలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు – 1,58,71,493,
మహిళలు 1,58, 43,339 ఓటర్లు ఉన్నారు. కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఉంది. 119 నియోజకవర్గాల్లో సగం కంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వుమెన్ ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. మహిళలు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే విజయమని నమ్ముతున్నారు. గత 2019 ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటును వినియోగించుకున్నట్టు గణంకాలు చెబుతున్నాయి. మహిళలు 67.2 శాతం, పురుషుల 67 శాతం మంది ఓటు వేశారు. ఇటీవల జరిగిన కర్ణాట ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడానికి మహిళలే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు లో డిఎంకె, ఢిల్లీలో ఆప్ గెలుపు నకు బిహార్‌లో జెడియు మహిళా ఓట్ల ప్రాధాన్యాన్ని గుర్తించి పథకాలు ప్రకటించారు.కర్ణాటకలో విజయం అందించిన పథకాలనే తెలంగాణాలో వాటినే తెస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. స్త్రీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని నేరుగా నగదు డిపాజిట్, వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీ, బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పథకాలు అమలు చేస్తున్న పథకాలు మహిళలను బాగా ఆకర్షిస్తున్నాయి. కల్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్, ఆరోగ్య మహిళ, అమ్మఒడి వాహనాలు, వి హబ్, ఒంటరి మహిళలకు పెన్షన్ వంటివి అమలవుతోంది. ఈసారి మరిన్ని వరాలు ప్రకటిస్తారని అందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలో మహిళలకు 2,500, 500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి అమలు చేస్తామని ప్రకటించింది. బీజేపీ కూడా ఇదే తరహా పథకాలతో మేనిఫెస్టో రూపొందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచేది అన్ననిర్ణయంలో మహిళా ఓటర్లదే కీలకం కానున్నది.
ఇవి కూడా చదవండి