నేరస్తులను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ తనే నేరస్తుడిగా మారాడు. అంతటితో ఆగకుండా చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి తన అనుభవాన్ని ఉపయోగించాడు. రెండేండ్ల పాటు మహిళా కానిస్టేబుల్ తల్లిదండ్రులను ఇటు పోలీసులను నమ్మించాడు. ఎంతటి నేరస్తుడైన చిన్న క్లూతో దొరుకుతాడన్నంటూ ఇతనూ అలాగే దొరికాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన మోనా అనే మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అదే పోలీస్ సురేంద్ర అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఈ పరిచయంతోనే సురేంద్ర తనను పెండ్లి చేసుకోవాలని మోనాను కోరిండు. కానీ ఆమె తిరస్కరించింది. ఈ క్రమంలోనే మోనా ఎస్ ఐ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యింది. ఎస్ ఐ ఉద్యోగంలోనూ చేరలేదు. ఇటు కానిస్టేబుల్ ఉద్యోగానికి రీజైన్ చేసింది. సివిల్స్ ప్రిపేర్ అవుతుండడంతో ఇదంతా తట్టుకోలేని సురేంద్ర మోనాను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఇంతటితో ఆగకుండా మృతదేహానికి రాళ్లు కట్టి పక్కనే ఉన్న డ్రయినేజీలో పడేశాడు. ఆతరువాత మోనా ఎవరితోనే వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులకు చెప్పి వారితో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. ఆమె కోసం వెతుకుతున్నట్టు నటిస్తూనే మరో వైపు సురేంద్ర తమ్ముడు రోవిన్‌తో మోనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించాడు. అప్పుడప్పుడు మోనా వాయిస్ రికార్డులను కూడా రోవిన్ చేత ఆమె కుటుంబ సభ్యలకు పంపేవాడు. ఈ క్రమంలో మోనా మిస్సింగ్ కేసు ఢిల్లి క్రైం బ్రాంచ్ కు చేరడంతో వారు ప్రత్యేక దృష్టి సారించారు. రోవీన్ ఫోన్ కాల్స్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో సురేంద్, రోవిన్, వీరికి సహకరించిన రాజ్‌పాల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మోనా హత్య జరిగిన రెండేండ్ల తర్వాత నిందితులు పట్టుబడ్డారు.
చదవండి ఇవికూడా…
గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి
తాయిత్తులు కట్టిస్తానని.. కన్నతండ్రి ఎదుటే చంపేశాడు
అయ్యో చిన్నారి… షాపింగ్ మాల్‌లో కరెంట్‌షాక్‌తో నాలుగేండ్ల చిన్నారి మృతి