పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమికుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా తను ప్రేమించిన అమ్మాయిపైనే కాల్పులు జరిపాడు. అనంతరం అతను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందాడు. యువతికి రెండు బుల్లెట్లు తగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మసౌరీ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఉన్న తరెగ్నా దిహ్ లో ఈ ఘటన జరిగింది. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కాల్పులు జరిపిన వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, రెండు బుల్లెట్ గాయాలపాలైన యువతిని ప్రాథమిక చికిత్స అనంతరం పీఎంసీహెచ్ కు తరలించారు. బీహార్‌లోని మసౌరి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని రాజుకుమార్‌గా గుర్తించారు. అతడి పక్కంటి అమ్మాయి రాజు ఇద్దరూ కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనను పెండ్లి చేసుకోవాలని రాజు ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానిక లోనైన రాజు ఆమెపై కాల్పులు జరిపాడు.
కాగా రాజు పార్ట్‌టైం పనిచేస్తూ చదువుకుంటున్నాడు. అతడి కుటుంబం పశువుల పెంపకం, వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.