కరీంనగర్ జిల్లా ఉత్తమ జిల్లా పంచాయతీ అధికారిగా వీర బుచ్చయ్య పటేల్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా పెరుక నర్సయ్య పటేల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు మున్నూరు కాపు ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం తరుపున ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామ సతీష్ పటేల్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మామిడి రమేష్ పటేల్, జిల్లా నాయకులు పుల్లెల సుధీర్ పటేల్, బట్టు కరుణాకర్ పటేల్, వంగ సుధాకర్ పటేల్, శ్రీగిరి శ్రీనివాస్ పటేల్, తోట సునీల్ పటేల్, బోనాల శ్రీహరి పటేల్, రాజగోపాల్ పటేల్, మౌనిక పటేల్,రాజ కుమార్ మరియు పతెం శ్రీనివాస్ పటేల్ పాల్గొన్నారు.