175కి 175 ఎందుకు కాకూడదని, ఆరు నెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయమని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీఎంక్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ఇన్ని రోజులు చేసిన పని ఒక ఎత్తు అని ఇప్పుడు చేసే పని మరొక ఎత్తు అని వ్యాఖ్యలు చేశారు. 175కి 175కి సాధ్యం కాబట్టే క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు ఒంటరిగా పోటీకి రాకుండా పొత్తులకు వెళ్తున్నాయని దుయ్యబట్టారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్మం, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకు వేయాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి.. విభేదాలను పరిష్కరించుకోవాలి. వచ్చే 6 నెలల్లో వీటిపై దృష్టి పెట్టాలని చెప్పారు.