అచ్చం జులాయి సినిమాను తలపించేలా ఏటీఎంను పగలగొట్టి రూ. 10 లక్షలు చోరీ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారంచోటు చేసు కుంది. నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని పోచం పాడ్ చౌరస్తా జాతీయ రహదారి 44 పక్కనున్నగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి దుండగులు రూ. 10 లక్షలు ఎత్తుకెళ్లారు.
జులాయి సినిమాలో బ్యాంక్ దొంగతనం సన్నివేశాన్ని తలపించేలా ఆగంతకులు షట్టర్ను ఐరన్ రాడ్లతో పైకి లేపి లోనికి ప్రవేశించి ఏటీఎం ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. బ్యాంకు అధికారులు తెలిపిన బుధవారం ఉదయం సుమారు 3 గంటల 18 నిమిషాలకు సర్వే లైన్స్ టీం ద్వారా రాజ్ కుమార్ కి సమాచారం అందింది. వెంటనే మెండోరా ఎస్సై జి.శ్రీనివాస్ యాదవ్ కు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేసరికే దుండగులు పారిపోయినట్టు ఎస్సై తెలిపారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించామని, డాగ్ స్క్వాడ్ బృందం ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. అంతర్రాష్ట్ర బ్యాంకు దొంగల ముఠానే పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బ్యాంకు చోరీకి పాల్పడిన ముఠా కోసం పోలీసు శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిందని అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎసిపి జగదీష్ చందర్, ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి సందర్శించారు.
చదవండి ఇవికూడా
గ్యాస్ స్టేషన్‌లో ప్రమాదం 20 మంది మృతి
తెగిన కడెం ప్రాజెక్ట్ గేటు రోప్.. వృథాగా నీరు