Shankara patanam news ” రవీందర్ రావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్
శంకరపట్నం డీసీ ప్రతినిధి
ప్రముఖ వ్యాపారి సామాజిక వేత్త వర్ధిని రవీందర్ రావు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి, సామాజికవేత్త బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వర్ధినేని రవీందర్ రావు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హుజురాబాద్ పట్టణంలో రవీందర్ రావు నివాసంలో హుజురాబాద్ వాకర్స్ అభిమానుల ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్, బిఆర్ఎస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
////////////////////////////////////////////////////////
రాజ్యాంగాన్ని గౌరవించని వారికి దేశాన్ని పాలించే అర్హత లేదు..
మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ…
శంకరపట్నం డిసి ప్రతినిధి
మహనీయులను, రాజ్యాంగాన్ని గౌరవించని పార్టీలకు దేశాన్ని పాలించే అర్హత లేదని, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మహనీయులను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ పేరిట చేపట్టిన దేశవ్యాప్త ప్రచారోద్యమంలో భాగంగా శనివారం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన నియోజవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన అధ్యక్షతవహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను దేశ ప్రజలు క్షమించరన్నారు. మహనీయుల చరిత్రను మరుగునపర్చాలనే కుట్రలో భాగంగానే వారిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మల్యే విమర్శించారు. పార్లమెంట్ వేదికగా అమిత్ షా మహాత్మాగాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేనికి సూచిక అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యలను తప్పుపట్టకుండా ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆ పార్టీ ఎంపీలంతా మౌనం దాల్చడంతో షా వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సమర్థించినట్టుగా తేటతెల్లమైందని ఆయన పేర్కొన్నారు. మహనీయులను అవమానించే వారికి, రాజ్యాంగాన్ని కించపర్చే వారికి దేశాన్ని పాల్పించే అర్హత లేదన్నారు. మహనీయులపై సాగిస్తున్న కుట్రపూరిత వైఖరిని ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మానకొండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ పేరిట ప్రచారకార్యక్రమాలునిర్వహించాలని, పార్టీశ్రేణులంతా భాగస్వాములైన బీజేపీ తీరును ఎండగడుతూ ప్రజలను జాగృతపర్చాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. పథకాల అమలు విషయంలో ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటు వారి సమస్య పరిష్కారానికి పాటుపడినప్పుడు వారి మన్ననలు పొందగలుగుతామని, మనం అందుబాటు లేకుంటే ప్రజలను మనల్ని మర్చిపోతారన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నందగిరి రవీంద్రచారి, గోపగోని బసవయ్య గౌడ్, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, సిరాజ్ హుస్సేన్, మర్రి ఓదెలు యాదవ్, పులి కృష్ణ, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, పసుల వెంకటి, ఉప్పుగల్ల మల్లారెడ్డి, జెల్ల ప్రభాకర్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, దేవేంద్ర, సత్యారెడ్డి, ఎల్గందుల ప్రసాద్, ఎం రాజేశం, తాట్ల వీరేశం, సురేందర్, పాశం రాజేందర్ రెడ్డి, హన్మంతరెడ్డి, నారాయణరెడ్డి, మీస సత్యనారాయణ, సాయిరి దేవయ్య, అంజిత్ రావు, రామిడి తిరుపతి, సందీప్ కుమార్, బండిపల్లి రాజు, శ్రీనివాస్ రెడ్డి, బండారు రమేశ్, మాచర్ల ఆంజనేయులు, పోలు రమేశ్, రాము, తమ్మనవేణి రమేశ్ కుమార్ యాదవ్,కోండ్ర సురేష్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
//////////////////////////////////////////////////////////////////////
////////////////////////////////////////////////////////
ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయ యాత్ర
కరపత్రాలు ఆవిష్కరించిన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు
శంకరపట్నం డిసి ప్రతినిధి
వీర హనుమాన్ జయంతి యాత్ర గోడపత్రికలను విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నేతలు ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ నేతలు మాట్లాడారు. ఏప్రిల్ 12వ తేదీన నగరంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్టు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ , భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను శనివారం బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డులోని రామాలయం వద్ద ప్రారంభమై టవర్ సర్కిల్, ప్రకాశం గంజ్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, గీత భవన్, కోర్టు రోడ్డు, మంచిర్యాల చౌరస్తా మీదుగా కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సమాజన్ని జాగృతం చేయడానికి విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్
హాజరవుతారని చెప్పారు. ధైర్యం, శక్తి సామర్థ్యాలకు ప్రతీక అయినటువంటి హనుమంతున్ని ఆదర్శంగా తీసుకొని హిందూ యువత దేశ, ధర్మ రక్షణ కోసం పాటుపడాలనీ, లవ్ జీహాదీల నుండి మాతృ మూర్తుల రక్షణ, మత మార్పిడుల నిరోధం కోసం ఈ ర్యాలీలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్ష కమిటీ సభ్యుడు ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా సహా కార్యదర్శి తోట రాజేందర్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జేటి రాజేందర్, నగర కన్వీనర్ ఎల్లబోయిన మహేష్, నగర గోరక్ష ప్రముఖ్ వంశీ, నగర విద్యార్థి ప్రముఖ్ సంతోష్, నగర సహా సంయోజక్ రంజిత్, అలిమిల్ల సతీష్, నగర సత్సంగ్ ప్రముఖ్ వంగర ఆంజనేయులు,భజరంగ్ దళ్ నగర కన్వీనర్ మహేష్ యాదవ్,అఖిల్,అశోక్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
/////////////////////////////////////////////////////////////////////////
నీటి విడుదల చేసి రైతులను ఆదుకోండి…
అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు సతీష్…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
సాగు నీరందక వేసిన వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతులకు సాగునీరు అందిచేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు అంతడుపుల సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. సాగు నీరు విడుదల చేయాలని మండలంలోని రైతుల ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ భాస్కర్‌కు వినతి పత్రాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. శంకరపట్నం మండలంలో, ఈనెల 31 తరువాత ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా అందించే సాగునీరు ప్రభుత్వం నిలిపివేస్తుందని ప్రకటనలు వెలువడుతున్నాయని వాపోయారు. శంకరపట్నం మండలంలోని చివరి ఆయకట్టు రైతులైన కల్వల, గద్దపాక, అరకండ్ల కాచాపూర్, ధర్మారం కన్నాపూర్ ముత్తారం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో వేసిన పంటలు సాగునీరు అందక ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోరారు. తహసిల్దారు భాస్కర్ సానుకూలంగా స్పందించారని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జ రవి, కన కం శంకర్, దేవునూరి మల్లేశం, మహిపాల్ రెడ్డి, ఓదెల రాజయ్య, తోపాటు వివిధ గ్రామాల రైతుల, తదితరులు ఉన్నారు.
//////////////////////////////////////////////////////////////////////////////
ప్రభుత్వ పాఠశాలలో ఉగాది, రంజాన్ వేడుకలు..
శంకరపట్నం డిసీ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం రంజాన్, ఉగాది పండుగల వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. ఉగాది, రంజాన్ పండగలను పురస్కరించుకొని ఈ వేడుకలు నిర్వహించారు. పిల్లలు అత్యంత ఉత్సాహంగా ఆనందంగా గడిపినట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
///////////////////////////////////////////////////////