Teeth”దంతాలు మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తాయి… లండ‌న్ సైంటిస్టులు అద్బుత సృష్టి. వీడియో

Teeth”  ప్ర‌తి మ‌నిషికి పాల‌దంతాలు ఊడి శాశ్వ‌త దంతాలు వ‌స్తాయి.. శాశ్వ‌త దంతాలు వ‌చ్చాక ఏదైనా కార‌ణం చేత మ‌ళ్లీ ఊడిపోతే ఇక రావ‌ని తెలుసు. జీవితాంతం తొర్రిగా ఉండాల్సిందే.. లేదా స‌ర్జ‌రీ చేయించుకుని పెట్టుడు పళ్లు పెట్టించుకోవాలి. ఇటువంటి సంద‌ర్భాల్లోనే మ‌ళ్లీ దంతాలు వ‌స్తే బాగుటుంద‌ని చాలా మంది అనుకుంటు ఉంటారు. మ‌ళ్లీ మ‌ళ్లీ దంతాలు రావ‌డం త్వ‌ర‌లోనే నిజం కానుంది. ఇకపై మాన‌వుల‌కు కూడా స‌మీప భవిష్యత్తులోనే నోట్లోనే కొత్త దంతాలను పుట్టించొచ్చ‌ని లండన్ లోని కింగ్స్ కాలేజ్, ఇంపీరియల్ క‌ళాశాల శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ప్రపంచంలోనే మొద‌టి సారిగా రీసెర్చ్ ల్యాబ్‌లో మానవ దంతాలను విజ‌య‌వంతంగా పెంచిన‌ట్టు వారు ప్ర‌క‌టించారు. ఇక‌పై ఎవ‌రికీ దంతాలు అవ‌స‌రం ప‌డిన వారి దంత క‌ణాల‌తోనే ల్యాబ్‌లో పెంచి ఆత‌రువాత నోటిలో అమ‌ర్చ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. లేక‌పోతే నోటిలోనే తొర్రి పడ్డచోటే కొత్త దంతాలను సహజంగా పెరిగేలా చేయొచ్చని వారు అంటున్నారు.

నోట్లో మాదిరిగానే ఇవి కూడా దవడల లోతుల్లో నుంచి పుట్టి సహజంగానే పెరుగుతాయని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దంతాలు కావాల్సిన వారి సొంత దంత కణాలతోనే కొత్త‌వి పెరుగుతాయి.. దీంతో శరీరం తిరస్కరించే ప్రమాదం కూడా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని సైంటిస్టులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.
అయితే ఇప్ప‌టికిప్పుడు మాన‌వుల్లో ఈ చికిత్స ప్రారంభించ‌డం వీలు కాద‌న్నారు. ల్యాబ్ లోనే దంతాలను పూర్తిగా పెంచి, మ‌నిషి నోట్లోకి మార్పిడి చేయాలా..? లేకుంటే నోట్లోనే పుట్టించి, నోట్లోనే పెరిగేలా చేయాలా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తమ ముందు ఉన్నాయని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ క్ర‌మంలో ఏ పద్ధతిలో చికిత్స అందుబాటులోకి తీసుకురావాలన్నా కొన్ని సంవ‌త్స‌రాల సమయం పడుతుందని చెప్తున్నారు..

ఈ ప్ర‌యోగాలు అన్నీ పూర్త‌యితే ఇక‌పై మ‌నుషుల‌కు కూడా బల్లులు, ఏనుగులు, మొసళ్ల వ‌లె దంతాలు మళ్లీ మళ్లీ కొత్తగా పుడుతూనే ఉంటాయి.

 

 

దంతాలు మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తాయి… లండ‌న్ సైంటిస్టులు అద్బుత సృష్టి.

Mega DSC” మెగా డీఎస్సీ వివ‌రాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలో వీడియో చూడండి..

Current Affairs” లా కమిషన్‌ ఛైర్మన్ గా జస్టిస్‌ దినేశ్‌ బాధ్యతల స్వీకరణ.. క‌రెంట్ అఫైర్స్

China Bridge”ఇంత‌కు ముందు గంట ప్ర‌యాణం.. ఇప్పుడు నిమిషంలోనే చేరుకోవ‌చ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *