Accident” ఓ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయింది. నేషనల్ హైవేపై వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టి 15 సార్లు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చల్లకెరె మరియు బళ్లారి మధ్య జాతీయ రహదారి 150A పై చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు తాలూకాలోని బొమ్మక్కనహళ్లి మజీద్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందినవారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరణించిన వారిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు – మౌలా, సమీర్ మరియు రెహ్మాన్ గా గుర్తించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు పల్టీలు కొడుతున్న క్రమంలో అందులో నుంచి ఒకరు బయటకు విసిరివేయబడినట్టుగా పడ్డారు. ఈ ప్రమాదం లో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగం దీనికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
Karnataka: Shocking CCTV footage shows a Car flips 15 times, bodies thrown in the air, fatal accident on NH 150A between Challakere and Ballari near Bommakkanahalli Majid of Monakalmur taluk in Chitradurga district, claimed three lives, including two children. pic.twitter.com/Or6KIMd0ij
— Pinky Rajpurohit (@Madrassan_Pinky) April 2, 2025
Hollydays”సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు : ఇంటర్ బోర్డు
Sannabiyyam: దేశంలోనే సన్నబియ్యం పథకం చారిత్రాత్మకం: మంత్రి పొన్నం ప్రభాకర్
Dell” తేలికగా విద్యార్థులకు ఉపయోపడే…. తక్కువ ధరలో డెల్ కంపెనీ నుంచి ల్యాప్ టాప్..
Ioc” ఐఓసీ తొలి మహిళా అధ్యక్షురాలు.. పూర్తివివరాలు..
Power Plant In Rajasthan” సీఐఎస్ఎఫ్ వాహనాన్ని ఢీకొట్టిన గూడ్స్ రైలు…. వీడియో
Current Affairs” ఈశాన్య రాష్ట్రంలోని నగరం పేరుతో ఉన్న యుద్దనౌక ఏదీ..? పోటీ పరీక్షల ప్రత్యేకం
