Road Accident” ఆటో బోల్తా.. మహిళా కూలీలకు తీవ్ర గాయాలు…

Road Accident”  శంకరపట్నం డిసీ ప్రతినిధి
రహదారి ప్రమాదంలో ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మ‌హిళ‌లు గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే శంక‌ర‌ప‌ట్నంల మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు ప్యాసింజర్ ఆటోలో వీణవంక మండలం కాపులపల్లె గ్రామంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. తిరిగి స్వగ్రామం రాజాపూర్ కు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలోని ఆముదాలపల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు ఆటో పడింది. ఈ ప్ర‌మాదంలో కూలీలు గాయ‌ప‌డ్డారు. స్థానికంగా గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 108 వాహనం చేరుకొని క్షతగాత్రులను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

 

Robo” రోబోల బాక్సింగ్ చూశారా…? ఇప్పుడు చూడండి వీడియో

Helicopter accident” ఈ న‌ట్టే సీఈవో ప్రాణం తీసింది.. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం వీడియో

Samsung Galaxy” సాంసంగ్ నుంచి రెండు అద్బుత‌మైన ఫోన్లు.. వివ‌రాలు పరిశీలించండి..

Cinema news”మాలీవుడ్‌లో నూ పోటాపోటీ… 10 మమ్మట్టి మూవీకి పోటీగా బాసిల్‌ మూవీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *