New planet” మనకు ఏడాది పూర్తవ్వాలంటే 365 రోజులు పూర్తవ్వాలి… భూమ్మీద రోజుకు 24 గంటల చొప్పున ఉంటుంది. కానీ ఈ మధ్యనే ఓ గ్రహం కనుగొనబడింది. ఆ గ్రహం 30 గంటల్లోనే ఏడాది పూర్తి చేసుకుంటుంది. రోజున్నరలోనే దాని కక్ష్యను పూర్తి చేస్తుంది. ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గ్రహ నిర్మాణాన్ని త్రీడీలో రూపొందించారు. దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పప్పిస్ నక్షత్ర సముదాయంలో దాదాపు 900 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నWASP – 121b అనే గ్రహం మీద శాస్త్రవేత్తలు కొన్నాళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ రూపొందించిన వెరీ లార్జ్ టెలిస్కోప్ లోని నాలుగు పెద్ద టెలిస్కోప్ యూనిట్ల ద్వారా తెలుసుకున్న అంశాల ఆధారంగా మొదటిసారిగా త్రీడీ మ్యాప్‌ను రూపొందించారు. దాని ప్రకారం.. WASP – 121 b బీ గ్రహం భూమితో పోల్చితే తన కక్ష్యలో చాలా వేగంగా తిరుగుతోంది. దాని హోస్ట్ స్టార్‌కు చాలా దగ్గరగా తిరగడం వల్ల చాలా వేడిగా ఉంది. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు అల్ట్రాహాట్ బృహస్పతి”గా పిలుస్తున్నారు. అంతేకాదు.. ఇది దాని నక్షత్రానికి అత్యంత దగ్గరగా ఉండడం వల్ల టైడల్ లాక్ అయ్యింది. అంటే ఒక వైపు నిరంతరం పగలు, మరొక వైపు చీకటి ఉంటుంది. పగటి వైపు దాదాపు 4,900 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాత్రి వైపు 2,200 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. పరిశోధకులు చిలీలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి ఈ గ్రహంపై మూడు విభిన్న వాతావరణ పొరలను కనుగొన్నారు. ప్రతి దానిలో వేర్వేరు రసాయన మూలకాలు ఉన్నాయని తెలిపారు. కింది పొరలో ఆవిరి రూపంలోని ఐరన్ సమృద్ధిగా ఉందన్నారు. మధ్య పొరలో సోడియం, పై పొరలో హైడ్రోజన్ వీటితో పాటు ఇందులో టైటానియం వాయువును కూడా కనుగొన్నారు.
Local news” మోడల్ స్కూల్ ను క్షేత్రస్థాయిలో సందర్శించిన ఎంపీయ పిఎస్… విద్యార్థులు…
Mega DSC” మెగా డీఎస్సీ వివరాలు.. ఎలా దరఖాస్తు చేయాలో వీడియో చూడండి..
Helicopter accident” ఈ నట్టే సీఈవో ప్రాణం తీసింది.. హెలికాప్టర్ ప్రమాదం వీడియో
