Gold” ఏటీఏం గురించి తెలుసు.. ఏనీటైంమనీ.. మన బ్యాంక్ ఖాతాలో డబ్బుంటే బ్యాంకుకే పోవాల్సిన అవసరం లేదు. ఏటీఎం ఉన్నచోట కార్డ్ నుంచి డబ్బులు తీసుకునే విషయం తెలిసిందే. అయితే గోల్డ్ ఏటీఏం గురించి విన్నారా… అవును నిజమే గోల్డ్ ఏటీఏంను చైనాలోని షాంఘైలో ఏర్పాటు చేశారు. ఈ గోల్డ్ ఏటీఏం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అకౌంట్ హోల్డర్స్ గోల్డ్ కాయిన్స్, బంగారపు కడ్డీలను, చేయించిన ఆభరణాలను ఈ ఏటీఏం మిషన్లో వేయాలి.. అలా వేసిన బంగారాన్ని ఈ మిషన్ కరిగిస్తుంది. ఆ తర్వాత దాని స్వచ్చతను కరిగించి దాని బరువును తూకం వేస్తుంది. బరువుకు తగ్గ కరెన్సీ విలువను డిజిటల్ మనీ రూపంలో అకౌంట్కు హోల్డర్ బ్యాంకు ఖాతాకు పంపిస్తుంది.
చైనా కింగ్హుడ్ గ్రూప్ నిర్వహిస్తున్న ఈ ATM, మూడు గ్రాముల కంటే ఎక్కువ బరువున్న స్వీకరిస్తుంది. కనీసం 50 శాతం స్వచ్ఛత కలిగిన బంగారు వస్తువులను అంగీకరిస్తుంది. ఆపై సమానమైన విలువను 30 నిమిషాల్లోపు విక్రేత బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేస్తుంది. ఇందుకు ఎటువంటి పత్రాలు లేదా ID అవసరం లేదు.
చైనాలోని ఈ బంగారు ATM ఇది మారుతున్న కాలానికి సంకేతమని చెప్పవచ్చు. బంగారం ధరలు మరియు త్వరిత, పారదర్శక లావాదేవీలపై ఆసక్తి పెరగనుంది. కాగిత రహిత పరిష్కారాల వైపు అడుగులు వేస్తుంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ గోల్డ్ ఏటీఏంను చూసినవారు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. టెక్నాలజీలో దూసుకపోవడంలో చైనా ఎన్నో అడుగులు ముందుంటుందని నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి..
Local news” మోడల్ స్కూల్ ను క్షేత్రస్థాయిలో సందర్శించిన ఎంపీయ పిఎస్… విద్యార్థులు…
Robo” రోబోల బాక్సింగ్ చూశారా…? ఇప్పుడు చూడండి వీడియో
Karimnagar news” లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ గా తణుకు మహేష్
Earthquake” భూ ప్రకంపనలు.. అర్థంకాక పరుగులు పెట్టిన ఏనుగులు.. వీడియో
