America” రాజులు లేరు.. ఫ్యూడల్ యుగం ముగిసింది అంటూ అమెరికా పౌరులు నిరసన తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి పెరిగిపోయింది. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల పట్ల ఇతర దేశల్లోనూ ఇటు సొంత దేశంలోనూ అగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి. ఇదే నెలలో 5 తారీఖకున హ్యాండ్సాఫ్ పేరిట అమెరికా దేశ వ్యాప్తంగా భారీగా ఆందోళనలు నిర్వహించారు. మళ్లీ తాజాగా ఏప్రిల్ 19 తేదీన పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దిగిపో ట్రంప్ అంటూ నినదించారు. చట్ట నిబంధనలకు పౌరహక్కులకు, డోనాల్డ్ ట్రంప్ విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. ఫ్యూడల్ యుగం ముగిసింది.. రాజులు లేరు అని రాసిన ప్లకార్డ్‌లతో స్లోగన్‌లిస్తూ దేశంలోని పలు పట్టణాల్లో ర్యాలీలు తీశారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. న్యూయార్క్, వాషింగ్‌టన్‌లో అమెరిక పౌరులు భారీ ప్రదర్శన చేశారు.
వేలాది మంది వలసొచ్చిన వారిని సరైన పత్రాలు లేవంటూ దేశం నుంచి పంపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులను అరెస్ట్ చేయాన్ని ఖండించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నార ఆందోళన వ్యక్తం చేశారు. వలసవాదులకు అమెరికా స్వాగతం చెబుతుందని వారికి మద్దతిచ్చారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్రంప్‌ను తొలగించండి అంటూ నిరసన తెలిపారు. తమ బాధను వ్యక్తం చేసేందుకు గుర్తుగా కొన్ని చోట్ల అమెరికా జెండాను తలకిందులుగా ఎగురవేశారు. 50 నిరసనలు. 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమాన్ని ప్రతిబింబించేలా స యాభై.. యాభై.. ఒకటి పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ ఈ ఆందోళన లకు నాయకత్వం వహించింది.
Teeth”దంతాలు మళ్లీ మళ్లీ వస్తాయి… లండన్ సైంటిస్టులు అద్బుత సృష్టి. వీడియో
Mega DSC” మెగా డీఎస్సీ వివరాలు.. ఎలా దరఖాస్తు చేయాలో వీడియో చూడండి..
Road Accident” ఆటో బోల్తా.. మహిళా కూలీలకు తీవ్ర గాయాలు…
Samsung Galaxy” సాంసంగ్ నుంచి రెండు అద్బుతమైన ఫోన్లు.. వివరాలు పరిశీలించండి..
